NASA: ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు..ట్రంప్ వల్లే..

ట్రంప్ దెబ్బకు నాసా షేక్ అయిపోయింది. దీంతో అక్కడి సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.

New Update
NASA

NASA

ట్రంప్ అధికారంోలకి వచ్చాక మొత్తం అన్ని చోట్లా కాస్ట్ కటింగ్ చేశారు. ఫెడరల్ ఉద్యోగులను పీకేశారు. మిగిలిన వారి జీతాల్లో కోత పెట్టారు. అదేవిధంగా నాసాకు కూడా నిధులను తగ్గించేశారు. దీంతో నాసా సంక్షోభంలో కూరుకుపోయింది.  
 దీంతో అక్కడి సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. 2026 ఆర్థిక సంవత్సరానికి నాసా నిధులను దాదాపు పావు వంతు తగ్గించాలని ప్రతిపాదించడం దీనికి కారణమని చెబుతున్నారు. అయితే సీనియర్ ఉద్యోగుల నిర్ణయం నాసా భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపనుందని అంటున్నారు. 

Also Read :  హైదరాబాద్ లో యాసిడ్, కెమికల్స్ తో పాలు.. ఆ ఎరియాల్లో అమ్మకాలు.. షాకింగ్ వీడియోలు!

Also Read :  భూవివాదంలో నటి శిల్పా చక్రవర్తి.. ఎస్సై కి నోటీసులు

ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి..

ప్రస్తుతం నాసాలో జీఎస్-13 నుంచి జీఎస్-15 స్థాయిలలో ఉన్న సీనియర్ సిబ్బంది ఉద్యోగాల నుంచి పదవీ విరమణ తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.  వీరిలో చాలా మంది అంతరిక్ష విజ్ఞానం, మానవ అంతరిక్ష యాత్రలు వంటి మిషన్-క్లిటికల్ విభాగాల్లో పని చేస్తున్నారు. ట్రంప్ బడ్జెట్ కోతల కారణంగా నాసా చాలా ప్రాజెక్టులను తగ్గించనుంది. దీని వలన నాసా పరిశోధనా సామర్థ్యాలు దెబ్బ తింటాయని నిపుణులు అంటున్నారు. ఇది ఆర్టెమిస్, అంగారక గ్రహం మిషన్ వంటి భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. నాయకత్వ లేమి, బడ్జెట్ అస్థిరత నాసా దీర్ఘకాలిక లక్ష్యాలను, ముఖ్యంగా మానవులను తిరిగి చంద్రునిపైకి పంపడం, అంగారక గ్రహంపైకి యాత్రలు వంటి వాటిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Also Read: US VISA: యూఎస్ వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం!

Also Read :  భార్యాభర్తలుగా నిత్యా మీనన్, సేతుపతి.. 'సార్ మేడమ్' టీజర్ భలే ఉంది!

Trump Government | nasa | today-latest-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు