NASA: అమెరికాలో షట్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. మూతపడిన నాసా !

అమెరికాలో షట్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా స్పేస్ ఏజెన్సీ అయిన నాసాలో కూడా కార్యకలాపాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

New Update
NASA

NASA

అమెరికాలో షట్‌డౌన్‌(USA Shut Down) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా స్పేస్ ఏజెన్సీ అయిన నాసాలో కూడా కార్యకలాపాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. దాని అధికారిక వెబ్‌సైట్‌లో ''ఫెడరల్‌ ప్రభుత్వం నిధుల కొరత కారణంగా నాసా వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చేయడం లేదంటూ'' చూపిస్తోంది. అమెరికా ప్రభుత్వ నిధుల బిల్లులకు కాంగ్రెస్‌(అక్కడి పార్లమెంట్‌)లో ఆమోదం లభించకపోవడంతో ఇటీవల షట్‌డౌన్‌ మొదలైన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లలో తొలిసారిగా షట్‌డౌన్‌ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read :  పాకిస్తాన్ లో మళ్ళీ బాంబు పేలుడు.. తొమ్మిది మంది మృతి

NASA Closed Its Operations

Also Read: టీసీఎస్‌లో లేఆఫ్‌లు.. వాళ్లకి పరిహారంగా 2 ఏళ్ల జీతం

షట్‌డౌన్ ప్రభావం వల్ల అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు నాసా కూడా ఈ జాబితాలో చేరింది. ప్రస్తుతం అమెరికాలో కేవలం అత్యవసర సేవలు అంటే అంటే మిలటరీ, ఆస్పత్రులు, ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసర విభాగాల్లో మాత్రం సేవలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నాసాలో చూసుకుంటే కూడా పలు కీలక అంతరిక్ష ప్రాజెక్టులు నిధులు లేని కారణంగా ఆగిపోయినట్లు ప్రచారం నడుస్తోంది. కేవలం అతి ముఖ్యమైన సేవలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో ఉన్న వ్యోమగాములను పర్యవేక్షించడం, వ్యోమనౌకల పనులు మాత్రమే కొనసాగుతున్నట్లు సమాచారం. 

ఈ షట్‌డౌన్‌ ప్రభావం వల్ల నాసా రాబోయే రోజుల్లో చేపట్టబోయే మిషన్స్‌ ఆలస్యం కానున్నాయి. ఇప్పటికే ఆర్టెమిస్‌ ప్రొగ్రామ్ కింద నాసా వ్యోమగాములను మరోసారి చంద్రుని పైకి పంపించే పనిలో నిమగ్నమైంది. వచ్చే ఏడాది ఈ మిషన్‌ను లాంచ్‌ చేయనుంది. అలాగే ఇతర అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అయితే ఈ షట్‌డౌన్‌ ప్రభావం ఎక్కువ రోజులు ఉంటే ఈ మిషన్‌లు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా నాసాలో ఇలా కార్యకలాపాలు నిలిచిపోవడం ఇది మొదటిసారి కాదు. 2018-19 మధ్య వచ్చిన షట్‌డౌన్‌తో పాటు గతంలో వచ్చిన షట్‌డౌన్ల వల్ల కూడా పలు కార్యకలాపాలు ఆగిపోయాయి. 

Advertisment
తాజా కథనాలు