భూమిలాంటి మరో గ్రహం.. కుప్పలుతెప్పలుగా ఏలియన్స్!

నాసా పరిశోధకులు TESS అంతరిక్ష టెలిస్కోప్ సహాయంతో 35 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహాన్ని కనుగొన్నారు. అక్కడ జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవచ్చు. ఆ గ్రహం పేరు L 98–59 f. అక్కడ మానవ మనుగడకు అనుకూలంగా ఉండే ఏకైక గ్రహం ఇదే.

New Update
_L 98-59 system

విశ్వం గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని రహస్యం ఒకటి ఉంది. ఈ అనంతమైన అంతరిక్షంలో భూగ్రహంలో ఒంటరిగా ఉన్నామా? లేదా మనల్ని చూస్తూ మరెవరైనా ఉన్నారా? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడంలో పెద్ద అడుగు వేశారు. నాసా పరిశోధకులు TESS అంతరిక్ష టెలిస్కోప్ సహాయంతో 35 కాంతి సంవత్సరాల దూరంలో ఒక గ్రహాన్ని కనుగొన్నారు. అక్కడ జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవచ్చు. ఆ గ్రహం పేరు L 98–59 f, అది ఎర్ర మరగుజ్జు నక్షత్రం L 98–59 చుట్టూ తిరిగే ఐదు గ్రహాలలో ఒకటి. కానీ మానవ మనుగడకు అనుకూలంగా ఉండే ఏకైక గ్రహం ఇదే.

ట్రోటియర్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎక్సోప్లానెట్స్‌కు చెందిన ప్రధాన పరిశోధకుడు చార్లెస్ కాడియు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఇటువంటి కాంపాక్ట్ వ్యవస్థలో మనుగడకు అనువైన గ్రహాన్ని కనుగొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. విశ్వంలో గ్రహాలు ఎంత వైవిధ్యమైనవి, ప్రత్యేకమైనవిగా ఉంటాయో ఇది చూపిస్తుంది. L 98–59 f దాని నక్షత్రం నుంచి భూమి సూర్యుడి నుండి పొందే శక్తిని పొందుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇదే దానిని నివాసయోగ్యమైన మండలంలో ఉంచుతుంది. అలా అక్కడ నీరు ఉండే అవకాశం ఉంది. ఈ నక్షత్రాన్ని 2019 సంవత్సరంలో కనుగొన్నారు. మొదట్లో దీనికి 4 గ్రహాలు ఉన్నాయని నిర్ధారించారు. కానీ ఇప్పుడు డేటాను లోతుగా విశ్లేషించిన తర్వాత, శాస్త్రవేత్తలు 5వ గ్రహాన్ని కనుగొన్నారు. ఇది L 98–59 f  మనకు ప్రత్యక్షంగా కనిపించదు. L 98–59 b భూమి కంటే 84% చిన్నది. ఈ గ్రహం గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు NASA అత్యంత పవర్ ఫుల్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించాలనుకుంటోంది.

Advertisment
తాజా కథనాలు