Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మన్మోహన్ భార్య, ముగ్గురు కుమార్తెలతో పాటు ఇతర బంధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.