Manmohan Singh: మన్మోహన్ అంత్యక్రియలపై వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం!

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

New Update
Manmohan singh

Manmohan singh

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆయన స్మారకార్థం ఢిల్లీలో ఓ స్థలాన్ని కేటాయించాలని కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ దానిపై కేంద్రం స్పందించకపోవడంతో కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.

ALSO READ: ఘోరం.. వంతెనను ఢీకొట్టిన బస్సు.. 8 మంది ప్రయాణికులు మృతి!

స్థలం కేటాయింపు

ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారకార్ధం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యర్ధన మేరకు మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనిపై క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే అమిత్ షా నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ALSO READ:: ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే!

అంత్యక్రియలు ఎక్కడంటే?

నేడు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. 11 గంటల 45 నిమిషాలకు నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. మరి కాసేపట్లో మన్మోహన్ నివాసం నుంచి AICC ఆఫీసుకు పార్థివదేహం తరలించనున్నారు. 9 గంటల 30 నిమిషాలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. 

ALSO READ: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. క్రికెట్‌ చరిత్రలో ఏకైక మొనగాడు

ఇదిలాఉండగా.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ పీఎం మన్మోహన్ సింగ్‌కు గురువారం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటుండగానే రాత్రికి ఆయన తుదిశ్వాస విడిచారు.

దేశవ్యాప్తంగా ప్రజల సంతాపం

Also read: ప్రధాని మోదీ చనిపోయారంటూ నోరు జారిన యాంకర్.. వీడియో వైరల్!

మరోవైపు మన్మోహన్‌ సింగ్‌ మరణంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. వాట్సాప్‌ స్టేటస్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లలో, ఎక్స్‌లో పోస్టులు చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.  ఆయన  ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. 1991, 2009లో దేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి గట్టెంకించిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు