మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలో నిగమ్‌బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కరణలు జరిగాయి. విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పాడే మోశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాజీ ప్రధానికి చివరి వీడ్కోలు పలికారు. Also Read: చెన్నై గ్యాంగ్ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు ! త్రివిధ దళాల అధిపతులు కూడా ఆయనకు నివాళులర్పించారు. ఢిల్లీ సీఎం అతిషి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. అంతేకాదు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్ ఇలాగే పలువురు విదేశీ ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం ఉదయం మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం AICC ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం అక్కడినుంచి నిగమ్‌బోధ్ ఘాట్ వరకు అంతియమాత్ర జరిగింది. Also Read: మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్‌పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు.. ఇదిలాఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఆ రోజు సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. శనివారం ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు సంతపం తేలియజేస్తున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా, ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. Also Read: వామ్మో చలి.. మరోవైపు భారీ వర్షం..15ఏళ్ల రికార్డు బద్దలు.. ఢిల్లీలో చాలా కష్టం భయ్యా!