మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశప్రజలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. శనివారం ఆయనకు కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ.. మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించి ఎమోషనల్ సందేశాన్ని రాసుకొచ్చారు. '' మన్మోహన్ సింగ్ మరణంతో మనం అపార జ్ఞానం, వినయంతో ఉండే నాయకుడిని కోల్పోయాం. ఆయన తన హృదయపూర్వకంగా, సృజనాత్మకతతో దేశానికి సేవలందించారు. కాంగ్రెస్ పార్టీకి ఓ దారి చూపించారు. ఆయన చేపట్టిన చర్యలు, దూరదృష్టి వల్ల కోట్లాది మంది భారతీయల జీవితాల్లో వెలుగులు నింపాయి. Also Read: అలా చేయకుంటే స్థానిక ఎన్నికలు జరగనివ్వం.. కవిత సంచలన కామెంట్స్ మన్మోహన్ సింగ్ సూచించిన సలహాలు, అభిప్రాయాలు దేశ రాజకీయల్లో ఎంతో విలువలతో కూడుకున్నవి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నేతలు, పండితులు నుంచి ఆయన గౌరవం, ప్రశంసలు అందుకున్నారు. తాను చేపట్టిన ప్రతి అత్యున్నత పదవికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఆయన మరణం నాకు వ్యక్తగతంగా చాలా వేధిస్తోంది. అతనే నాకు స్నేహితుడు, ఫిలాసఫర్, మార్గదర్శి. సామాజిక న్యాయం, లౌకికత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయన చూపించిన నిబద్ధత ఎంతో ఉన్నతమైంది. Also Read: యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్‌రేప్.. కొరడాతో కొట్టుకున్న బీజేపీ స్టార్ లీడర్ ఆయనతో ఏ క్షణం గడిపినా తన జ్ఞానం, తెలివితేటలను పొందవచ్చు. తన నిజాయతీ, సమగ్రతతో కదిలిపోవచ్చు. తన వినయానికి దాసోహం అయిపోవచ్చు. దేశ ప్రజల జీవితాల్లో ఆయన లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము, భారతదేశ ప్రజలు మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడు ఉన్నందుకు ఎప్పటికీ గర్విస్తారు, కృతజ్ఞతా భావంతో ఉంటారు. దేశ ప్రగతికి, అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి వర్ణించలేనిదని'' సోనియా గాంధీ రాసుకొచ్చారు. Also Read: చైనా బిగ్ ప్లాన్.. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌కు ఏర్పాట్లు Also Read: విరాట్‌ను అవమానించిన ఆసీస్ మీడియా.. ఆ పేరుతో హెడ్ లైన్స్