Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మన్మోహన్ భార్య, ముగ్గురు కుమార్తెలతో పాటు ఇతర బంధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

New Update
Manmohan singh

Manmohan singh

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఢిల్లీలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్య క్రియలను పూర్తిచేశారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన అస్థికలను ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. మజ్ను కా తిలా గురుద్వారా సమీపంలో ఉన్న అష్ట్‌ ఘాట్‌ వద్ద సిక్కు సంప్రదాయాల ప్రకారం అస్థికలను కలిపారు. మన్మోహన్‌ సింగ్ భార్య గురుశరణ్‌ కౌర్, అతని ముగ్గురు కుమార్తెలు ఉపిందర్‌ సింగ్, దమన్‌ సింగ్, అమృత్‌ సింగ్‌తో పాటు మరికొందరు బంధువులు కలిసి నిమజ్జనం చేశారు. 

ఇది కూడా చూడండి: Ap: జనసేనలోకి తమ్మినేని సీతారాం..క్లారిటీ ఇచ్చేసారుగా..!

ఇది కూడా చూడండి: ప్రశ్నపత్రం లీకేజీ.. అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ

ప్రభుత్వ అధికార లాంఛనాలతో..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌(92) గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో శనివారం ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. 

ఇది కూడా చూడండి:  Rythu Bharosa: రైతు భరోసాపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్

ఇది కూడా చూడండి:  ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

Advertisment
తాజా కథనాలు