మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య వివాదం తలెత్తింది. ఆయన స్మారకార్థం ఢిల్లీలో ఓ స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది. కానీ కేంద్రం స్పందించకపోవడంతో కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Manmohan singh

Manmohan singh

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య వివాదం తలెత్తింది. ఆయన స్మారకార్థం ఢిల్లీలో ఓ స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది. కానీ మోదీ సర్కార్ దీనిపై స్పందించకపోవడం వల్ల హస్తం పార్టీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్‌ను సంప్రదించకుండానే నిగమ్బధ్‌ ఘాట్‌లో మన్మోహన్‌ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. అయితే స్మారక చిహ్నం ఏర్పాటు చేయడమే ఆయనకు ఘన నివాళి అని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. మరి మన్మోహన్‌ సింగ్ కోసం కేంద్రం స్మారక చిహ్నాన్ని్ ఏర్పాటు చేస్తుందా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

Also read: ప్రధాని మోదీ చనిపోయారంటూ నోరు జారిన యాంకర్.. వీడియో వైరల్!

ఇదిలాఉండగా.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ పీఎం మన్మోహన్ సింగ్‌కు గురువారం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటుండగానే రాత్రికి ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే డిసెంబర్ 28న (శనివారం) కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.   

Also Read: చైనా బిగ్‌ ప్లాన్.. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌కు ఏర్పాట్లు

మరోవైపు మన్మోహన్‌ సింగ్‌ మరణంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. వాట్సాప్‌ స్టేటస్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లలో, ఎక్స్‌లో పోస్టులు చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.  ఆయన  ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. 1991, 2009లో దేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి గట్టెంకించిన సంగతి తెలిసిందే. 

Also Read: హార్ట్ సర్జరీ అయ్యాక మన్మోహన్ సింగ్ అన్న మాటలు ఇవే..

Also Read: సూర్యుడి దగ్గరికి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్‌ సురక్షితమే: నాసా

Advertisment
తాజా కథనాలు