భారత దివగంత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనకు నివాళులర్పించేందుకు కనీసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. '' మా నాన్న మరణించిన సమయంలో కాంగ్రెస్.. సీడబ్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ఓ సీనియర్ నేత రాష్ట్రపతులకు ఇలా సీడబ్యూసీ మీటింగ్‌లో నివాళులు అర్పించడం లేదని చెప్పారు. కానీ మా నాన్న డైరీని చదివినప్పుడు అది అబద్ధమని తెలిసింది. When baba passed away, Congress didnt even bother 2 call CWC 4 condolence meeting. A senior leader told me it"s not done 4 Presidents. Thats utter rubbish as I learned later from baba"s diaries that on KR Narayanan"s death, CWC was called & condolence msg was drafted by baba only https://t.co/nbYCF7NsMB — Sharmistha Mukherjee (@Sharmistha_GK) December 27, 2024 Also Read: 2024లో అంతర్జాతీయంగా ప్రభావితం చేసిన ముఖ్య విషయాలు.. మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ మరణించాక సీడబ్యూసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనకు నివాళులర్పించినట్లు ఆ డైరీలో రాసుంది. ఇది మా నాన్న ఆధ్వర్యంలోనే జరిగిందని'' శర్మిష్ట రాసుకొచ్చారు. అంతేకాదు ఆ సమయంలో ఈ అంశంపై కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని కూడా ఆరోపించారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరడాన్ని శర్మిష్ట సమర్థించారు. ''మన్మోహన్ సింగ్ కోసం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన. ఇందుకు ఆయన అర్హుడు. మా నాన్న రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని కూడా కోరారు. కానీ పలు కారణాల వల్ల ఇది జరగలేదని'' తెలిపారు. Having said that, a memorial for Dr. Singh is a great idea. He deserves it & also Bharat Ratna which baba as President wanted 2 confer on him; but that didn"t happen perhaps due 2 reasons which don"t need to be spelled out. https://t.co/5MhH7k5Smq pic.twitter.com/yUZCEXNMxK — Sharmistha Mukherjee (@Sharmistha_GK) December 27, 2024 Also Read: వామ్మో చలి.. మరోవైపు భారీ వర్షం..15ఏళ్ల రికార్డు బద్దలు.. ఢిల్లీలో చాలా కష్టం భయ్యా! ఇదిలాఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఆ రోజు సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. శనివారం ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు సంతపం తేలియజేస్తున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా, ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.