BIG BREAKING: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్!
టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి తనపై సురేష్ తో పాటు ఆయన సోదరుడు, బంధువులు దాడి చేసినట్లు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సురేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.