Miss World 2025: మిస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ విజేతగా ఎస్తోనియా భామ ఎలిస్‌ రాండ్మా

హైదరాబాద్‌ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి క్రీడల ఛాలెంజ్‌ పోటీల్లో మిస్‌ వరల్డ్‌ ఎస్తోనియా ఎలిస్‌ రాండ్మా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 1999 తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో తదుపరి రౌండ్‌కు చేరుకోవడం ఎస్తోనియా దేశానికి ఇదే మొదటిసారి.

New Update
Miss World 2025

Miss World 2025

హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి క్రీడల ఛాలెంజ్‌ పోటీల్లో మిస్‌ వరల్డ్‌ ఎస్తోనియా ఎలిస్‌ రాండ్మా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 1999 తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో తదుపరి రౌండ్‌కు చేరుకోవడం ఎస్తోనియా దేశానికి ఇదే మొదటిసారి.

Also Read: J&K: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ..కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ముఫ్తీ

Miss World 2025 - Hyderabad

హైదరాబాద్‌ కేంద్రంగా మి స్‌ వరల్డ్‌  పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాగా ఈ పోటీలలో భాగంగా కంటెస్టెంట్లకు స్పోర్ట్స్‌ డే ఈవెంట్‌ నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్‌ డే లో అందాల భామలు పలు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా కంటెస్టంట్లకు పది స్పోర్ట్స్‌ ఈవెంట్లు నిర్వహించారు. 

Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
 
కాగా ప్రపంచ సుందరి స్పోర్ట్స్‌ డే ఈవెంట్‌లో  మిస్‌ ఎస్తోనియా ఎలిస్‌ రాండ్మా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎలిస్‌ రాండ్మా తన ప్రతిభతో ఆకట్టుకున్నారు. కాగా1999 తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో ఎస్తోనియా దేశం తదుపరి రౌండ్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఇక రెండవ స్థానంలో కరేబియన్‌ దీవులకు చెందిన మిస్‌ మార్టినిక్‌ ఆరేలీ జోచిమ్‌ రజత పతకాన్ని గెలుచుకుంది. మూడవ స్థానంలో మిస్‌ కెనడా ఎమ్మా మోరిసన్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. 

Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
 
మిస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ ఛాలెంజ్‌లో భాగంగా 108 దేశాల నుంచి వచ్చిన అందాల భామల్లో క్రీడల్లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన వారిని అమెరికా,-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా -ఓషియానా జట్లుగా విభజించి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి చేతిలో పట్టుకుని స్టేడియంలో పరుగెత్తి అందరినీ ఉత్సాహపరిచారు. కాగా ప్రపంచ సుందరీమణులు స్పోర్ట్స్‌ ఛాలెంజ్‌ఈవెంట్‌ ఫైనల్‌ లో బ్యాడ్మింటన్, చదరంగం, షాట్‌పుట్, స్ప్రింట్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలకు ముందు మిస్‌ వరల్డ్‌ ఇండియా నందిని గుప్తాతో సహా 40 మంది పోటీదారులు యోగ సాధన చేసి ఆకట్టుకున్నారు. విజేతలకు ఒలింపియన్‌ ఇషాసింగ్,బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ శివసేన్‌రెడ్డి పతకాలను అందజేశారు.

ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

 

telugu-sports-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు