/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Sankranti-holidays-jpg.webp)
Summer Holidays 2025
తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉన్నాయి. జూన్ 12వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. అయితే ఇప్పుడు ఆ సెలవులను ఏపీలోని కొన్ని విద్యాసంస్థలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొన్ని విద్యాసంస్థలకు మరో 20 రోజులు సెలవులను పెంచనుంది.
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
కేవలం ఈ విద్యా సంస్థలకు మాత్రమే..
ఏపీలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలకు మే 5 నుంచి సెలవులు మొదలయ్యాయి. వీరికి జూన్ 30 వరకు సెలవులు కొనసాగనున్నాయి. అయితే కేవలం విద్యార్ధులకు మాత్రమే కాకుండా ట్రిపుల్ ఐటీ సిబ్బందికి కూడా సెలవులు ఇచ్చారు. ఈ విద్యాసంస్థల సిబ్బందికి మే 18 నుంచి జూన్ 9 వరకు సెలవులు ఇచ్చారు.
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం ఏపీలోని ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2025-26 అకాడమిక్ సంవత్సరానికి సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ నడుస్తోంది. మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత డెడ్‌లైన్ ముగుస్తుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
జూన్ 5వ తేదీన ఎంపికైన విద్యార్ధుల జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన విద్యార్ధులకు నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ప్రాంగణాల్లో సీటు లభిస్తుంది. ట్రిపుల్ ఐటీ అనేది పదో తరగతి తరువాత ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు. పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!
ap-nuziveedu | holidays | latest-telugu-news | today-news-in-telugu | summer-holidays | school-holidays | breaking news in telugu