JYOTHI MALHOTRA: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!

పాక్‌కు యూట్యూబర్ జ్యోతి గూఢచర్యం చేసిందని ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. రెండుసార్లు పాక్‌లో పర్యటించిన ఆమెను ఎవరైనా హనీ ట్రాప్ చేశారా? దేశంలో ఈమె ఎవరిని అయినా హనీ ట్రాప్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీకి, ఐఎస్ఐకి సమాచారం అందించిన పలువురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు ఈమె అందించినట్లు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. అయితే ఈమె పాక్‌కు గూఢచర్యం చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. ట్రావెల్ బ్లాగర్‌, యూట్యూబర్ అయిన జ్యోతి ట్రావెల్‌ విత్‌ జో (Travel With Jo) పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌‌ను నిర్వహిస్తోంది.

Also Read :  సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

SaveClip.App_440228990_18022379087480570_6844844662385822573_n

Also Read :  చార్మినార్ అగ్ని ప్రమాద బాధితులకు మోదీ పరిహారం

Jyoti Malhotra Shocking Facts

ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల బట్టి చూస్తే 2023లో రెండుసార్లు ఆమె పాకిస్తాన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కశ్మీర్ కూడా పలుమార్లు వెళ్లింది. ఇటీవల ఉగ్రదాడి జరిగిన పహల్గాంలో కూడా జ్యోతి సందర్శించింది. అది కూడా ఈ ఏడాది జనవరిలోనే ఆమె వెళ్లింది. అక్కడికి వెళ్లిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అక్కడ సెక్యూరిటీ లేదని, ఉగ్రదాడి చేయడానికి ఈ ప్లేస్ కరెక్ట్ అని ఇలా ట్రావెల్ చేసి చెప్పిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Also Read :  కొడాలికి సీరియస్.. అమెరికాలో ట్రీట్మెంట్?

SaveClip.App_491901137_18064803878480570_6331895949650928762_n

జ్యోతి మొదటిసారి పది రోజుల పాటు పాకిస్తాన్‌లో పర్యటించింది. ఫస్ట్ పాక్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి ఆ తర్వాతే కశ్మీర్ వెళ్లింది. ఈమె ప్లానింగ్ మీద ఇలా వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే జ్యోతి 2023లో పాక్‌ను సందర్శించడానికి వెళ్లినప్పుడు పాకిస్తాన్ హైకమీషన్‌లో డానిష్ అని పిలిచే ఎహ్సాన్-ఉర్-రహీంతో పరిచయం ఏర్పడింది. ఆమె పాక్‌లో సందర్శించిన రెండు సార్లు కూడా డానిష్ పరిచయస్తుడు అలీ అహ్వాన్‌ను కలిసింది. ఆమెకు అక్కడే బస కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే అహ్వాన్ పాకిస్తానీ భద్రతా, నిఘా అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Also Read :  గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం..మృతులు వీరే

SaveClip.App_479499648_18057493634480570_5504899251197371819_n

ఈ సమావేశంలో షకీర్, రాణా షాబాజ్‌లు కూడా ఉన్నారట. అయితే ఎవరికీ కూడా ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు షాబాజ్ మొబైల్ నంబర్‌ను 'జాట్ రంధావా' గా సేవ్ చేసుకుంది. ఎన్‌క్రిప్టెడ్ ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమె వీరితో టచ్‌లో ఉండేది. అయితే జ్యోతికి పాక్ హై కమిషన్‌లో ఉన్న ఒకరితో రిలేషన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈమె ఇక్కడి సమాచారాన్ని పాక్‌కు ఎలా చేరవేస్తుంది? అక్కడ ఈమెను ట్రాప్ చేశారా? అసలు భారత్ నిఘాలో ఉన్న విషయాలు ఈమెకు ఎలా చేరుతున్నాయి? దేశంలో ఈమె కీలక వ్యక్తులను హనీట్రాప్ చేసిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

SaveClip.App_460173430_18039576158480570_3650768574640307047_n

సాధారణంగా అబ్బాయిలు హనీ ట్రాప్‌కు గురవుతారు. అయితే జ్యోతి భారత్‌కి సంబంధించిన సున్నితమైన విషయాలను పాక్‌కు చేరవేస్తుందంటే.. ఈమెను ఎవరైనా హనీ ట్రాప్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జ్యోతికి దేశంలో ఎవరైనా సమాచారం అందిస్తున్నారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. భారత నిఘా వర్గాల్లో ఈమె ఎవరిని అయినా హనీ ట్రాప్ చేసిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. దేశానికి సంబంధించి సున్నితమైన అంశాలు ఈమెకు ముందు ఎలా చేరుతున్నాయి? ఈమె ఎలా పాక్‌కు చేరవేస్తుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

SaveClip.App_495070056_18065101721480570_5988479835406443942_n

భారతదేశంలో మొత్తం ఆరుగురు పాకిస్తానీ గూఢచారులను ఇంటెలిజెన్స్‌ అరెస్టు చేశారు. జ్యోతి మల్హోత్రాతో పాటు గజాలా, బాను, పంజాబ్ నుంచి మలేర్‌కోట్లా-యమీన్, హర్యానా నుంచి దేవిందర్ సింగ్ థిల్లాన్, అర్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు నిందితులు ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుంచి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. 

JYOTHI YOUTUBER ARREST

 

(arrested | india | pakistan | latest-telugu-news | JYOTHI MALHOTRA)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు