/rtv/media/media_files/2025/04/26/Ji87wtGpsEGfSuTsJN7w.jpg)
Indian Army
పాకిస్తాన్ లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన భారత ఆర్మీని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయంలో ఆయుధాలను కొనుగోలు చేసే అధికారాలను ఆర్మీకే అప్పగించింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అత్యవసర సమయాల్లో నేరుగా కొనేలా రక్షణ దళాలకు అధికారం కట్టబెట్టింది. రూ. 40 వేల కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయనుంది.
Also Read : Weather Update: ఐఎండీ బిగ్ అలర్ట్.. శక్తి తుపాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Also Read : బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
కొత్త వెపన్స్, మందుగుండు సామాగ్రి..
దీంతో పాటూ కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఆర్మీకి ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ ఫలితంగా భారత రక్షణ బడ్జెట్ మరో రూ.50,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రక్షణ రంగంలో భారత్‌ను మరింత పటిష్టం చేసేందుకు మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఆర్మీకి కొత్త వెపన్స్, మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. బడ్జెట్‌లో రక్షణ రంగానికి నిధులు పెంపు దిశగా మోదీ సర్కార్ సమాలోచలు చేస్తుంది. రక్షణ రంగానికి మరో రూ.50 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు నుంచి సమాచారం అందుతోంది. ఈ పెంపుదల ఆమోదం పొందితే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రక్షణ శాఖకు కేటాయింపులు రూ.7 లక్షల కోట్లకు మించిపోతాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బడ్జెట్ కు ఆమోదం కోరే అవకాశం ఉంది.
today-latest-news-in-telugu | central-government | Indian Army | wepons | national news in Telugu | latest-telugu-news
Also Read: USA: పౌరసత్వం కావాలంటే గేమ్ ఆడాలి..అమెరికా ట్రంప్ ప్రభుత్వం చెత్త ఐడియా
Also Read : ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..