/rtv/media/media_files/2024/12/21/NgvABOL5nn2CrYcAymyY.jpg)
Nandigam Suresh Photograph: (Nandigam Suresh)
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ తనపై దాడి చేశాడంటూ రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో సురేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల వర్గాల నుంచి తెలుస్తున్న వివరాల ప్రకారం.. నందిగం సురేష్ స్వగ్రామం ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి ఓ కారు అతివేగంగా వేగంగా దూసుకువచ్చింది. దీంతో ఇంత స్పీడ్ ఏంటని డ్రైవర్ ను రాజు మందలించాడు. విషయం తెలుసుకున్న సురేష్ అనుచరులు అక్కడికి చేరుకుని రాజుపై దాడి చేశారు.
ఇది కూడా చదవండి: Kodali Nani: కొడాలికి సీరియస్.. అమెరికాలో ట్రీట్మెంట్?
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
— RTV (@RTVnewsnetwork) May 18, 2025
సొంత గ్రామంలో టీడీపీ కార్యకర్తపై మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడి..
తుళ్ళూరు (మం) ఉద్దందరాయునిపాలెం లోని నివాసం వద్ద ఘటన..
మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు..
సురేష్ తనపై దాడి చేశాడని తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన… pic.twitter.com/wQXPTdurDT
అనంతరం అతడిని సురేష్ ఇంటికి ఎత్తుకెళ్లారు. అక్కడ సురేష్ తో పాటు ఆయన అన్న ప్రభుదాసు, వారి బంధువులు సురేష్ పై తీవ్రంగా దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన రాజును అతని కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్ లో చేర్పించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సురేష్ సోదరుడితో పాటు కేసులో ఉన్న వారి బంధువులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh-Modi: మోదీని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ-PHOTOS
145 రోజుల జైలు జీవితం..
వెలగపుడికి చెందిన మరియమ్మ అనే మహిళ అత్యకేసులో సురేష్ గతేడాది అక్టోబర్ 7న అరెస్ట్ అయ్యారు. దాదాపు 145 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఈ కేసులో జనవరి 28న ఆయనకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఆ సమయంలో కాలర్ బోన్ నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు సురేష్. అయితే.. మరోకేసులో ఆయన నేడు అరెస్ట్ అయ్యారు.
(nandigama suresh | telugu-news | latest-telugu-news | telugu breaking news)