ఏపీ మాజీ కొడాలి నాని ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు. అనంతరం హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే.. ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో నానిని అమెరికాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ఆయన చికిత్స తీసుకోనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
భయంతోనే వెళ్తున్నారా?
అయితే.. భయంతోనే కొడాలి నాని అమెరికాకు వెళ్తున్నాడని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కొడాలి నానిపై మట్టి, ఇసుక అక్రమ రవాణా తదితర ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ తదితరులపై ఆయన అసభ్య పదజాలంతో దూషించాడని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఇదే తరహా అభియోగాలతో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ తదితరులు జైలుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొడాలి కూడా జైలుకు వెళ్తాడన్న చర్చ చాలా రోజులుగా ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా ఆయన దేశం దాటే ప్రయత్నాలు చేస్తున్నాడని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం కొడాలి నాని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే.. ఆయనకు సంబంధించిన ఆరోగ్య, ఇతర వివరాలను కుటుంబ సభ్యులు అస్సలు బయటకు రానివ్వడం లేదు. అత్యంత సన్నిహితులను తప్పా.. పరామర్శకు ఎవరినీ అనుమతించడం లేదు. జగన్ కూడా ఫోన్లోనే నానిని పరామర్శించారు. డాక్టర్ల సూచన మేరకే ఆయన బయటకు రావడం లేదని.. ఎక్కువగా ఎవరినీ కలవడం లేదని సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!
(telugu-news | telugu breaking news | latest-telugu-news | kodali nani | health-update | today-news-in-telugu | america | andhra-pradesh-news)