KL Rahul: ఇంగ్లాండ్‌లో ఊచకోత.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టిన KL రాహుల్
ఇంగ్లండ్‌తో జరిగిన 3వ టెస్టులో కేఎల్ రాహుల్ అజేయ అర్ధసెంచరీతో మెరిశాడు. SENA దేశాల్లో ఓపెనర్‌గా ఇది అతనికి 11వ 50+ స్కోరు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ (10) రికార్డును అధిగమించి, సునీల్ గవాస్కర్ (19), దిముత్ కరుణరత్నే (12) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.