/rtv/media/media_files/2025/07/31/kl-rahul-kkr-2025-07-31-16-34-12.jpg)
KKR:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం ట్రేడ్ డీల్ ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేఎల్ రాహుల్ కు కెప్టె్న్సీ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సహ -యాజమాన్యంలోని ఫ్రాంచైజీ ఇప్పటికే రాహుల్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం. శ్రేయాస్ అయ్యర్‌ను వదులుకున్న తర్వాత KKRకు సరైన కెప్టెన్సీ ఎంపిక లేకుండా పోయింది. కేఎల్ రాహుల్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మంచి అనుభవం ఉంది. KKR అతనికి కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పగించే అవకాశం ఉంది. ఇక KKR అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కేఎల్ రాహుల్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది ఈ ట్రేడ్‌కు ఒక ముఖ్యమైన కారణంగా చెబుతున్నారు. రాహుల్ స్వయంగా తన వైట్-బాల్ క్రికెట్‌లో అభిషేక్ నాయర్‌తో చేసిన కృషి దోహదపడిందని గతంలో పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రాహుల్ అద్భుతంగా ఆడాడు. 13 మ్యాచ్ లలో 539 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో రాహుల్ ను వదులుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. IPL 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటతీరు దారుణంగా ఉంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు మాత్రమే గెలిచింది. 2024లో జట్టును విజేతగా నిలిపిన శ్రేయాస్ అయ్యర్‌ను వదులుకోవడం, రూ. 23.75 కోట్లకు వెంకటేష్ అయ్యర్‌ను కొనుగోలు చేయడం - ఫ్రాంచైజీకి భారీగా నష్టం కలిగించాయి. గత సీజన్‌లో కోల్‌కతా జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహించాడు. ఇక కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ వదులుకోగా.. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ. 14 కోట్లకు తీసుకుంది.
ఐపీఎల్ ప్రస్థానం చూసుకుంటే
కేఎల్ రాహుల్ ఐపీఎల్ ప్రస్థానం చూసుకుంటే అతను ఐపీఎల్‌లో పలు జట్లకు ఆడాడు. 2013, 2016 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), 2014, 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), 2018-2021 వరకు పంజాబ్ కింగ్స్ (PBKS) (ఈ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు). 2022-2024 మధ్య లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌గా ఉన్నాడు. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ DC తరపున ఆడాడు. కాగా IPL 2026 కోసం ఆటగాళ్ల ట్రేడ్ విండో ఈ ఏడాది చివరలో రిలీజ్ అవుతుంది.
హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ రాజీనామా
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని KKR ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. పండిట్ తన రాజీనామా వెనుక ఖచ్చితమైన కారణాలను వెల్లడించనప్పటికీ, ఆయన కోచింగ్ శైలిపై కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆయన కఠినమైన క్రమశిక్షణ, నియంత్రణ కొన్నిసార్లు విదేశీ ఆటగాళ్లకు ఇబ్బందికరంగా ఉందని డేవిడ్ వైజ్ వంటి మాజీ KKR ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. చంద్రకాంత్ పండిట్‌తో పాటు, KKR బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా జట్టు నుండి వైదొలిగినట్లు సమాచారం.