/rtv/media/media_files/2025/10/03/ind-vs-wi-2025-10-03-20-39-27.jpg)
IND Vs WI
భారత్ vs వెస్టిండీస్ జట్ల మధ్య రసవత్తరమైన టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ సిరీస్.. ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరేబియన్స్ 44.1 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ 48 బంతుల్లో 32 పరుగులు చేశాడు. షై హోప్ 36 బంతుల్లో 26 పరుగులు, రోస్టన్ చేజ్ 43 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేశారు. మిగతా వారు చేతులెత్తేశారు.
Also Read : రప్పా రప్పా.. ధోనీ, పంత్ రికార్డులను బద్దలు కొట్టిన జడేజా
IND Vs WI
ఆ తర్వాత టీమిండియా(team-india) బ్యాటింగ్‌కు దిగి పరుగుల వర్షం కురిపించింది. భారత్ సెకండ్ డే ఆట ముగిసే సమయానికి భారీ ఆధిక్యంలో నిలిచింది. 289 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. మరీ ముఖ్యంగా టీమిండియాలో ముగ్గురే ముగ్గురు సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్ కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా అద్భుతమైన ఫామ్‌తో విజృంభించారు. వీరు ముగ్గురు ఒకే రోజు ఆటలో సెంచరీలు నమోదు చేశారు. టీమిండియా 121/2 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించింది. అలా ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 128 ఓవర్లలో 448 పరుగులు చేసింది.
EMOTIONAL CELEBRATION BY KL RAHUL...!!! 🥺❤️
— Johns. (@CricCrazyJohns) October 3, 2025
- The best Test Opener Currently in Cricket. pic.twitter.com/hzxXAkzT3C
Also Read : వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మెరిసిన మీరాబాయి చాను
భారత బ్యాటర్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్(kl-rahul) చెలరేగిపోయాడు. అతడు 190 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ 210 బంతుల్లో 125 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా 176 బంతుల్లో 104* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురేల్ తనకు అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. రిషభ్ పంత్ తనకున్న గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో దిగిన జురేల్ అదిరే బ్యాటింగ్‌తో పరుగుల వర్షం కురిపించాడు.
5వ వికేట్‌కు జడేజాతో కలిసి 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత రెండో రోజు ఆట ముగియడానికి కాసేపు ముందు వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా ప్రస్తుతం క్రీజ్‌లో జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.
ఇకపోతే కేఎల్ రాహుల్ తన సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత విజిల్ వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఇలా ఎందుకు చేశాడో.. మ్యాచ్ అనంతరం వివరించాడు. తన కూతురు కోసం ఇలా చేశానని అతడు తెలిపాడు. టెస్టుల్లో రాహుల్‌కి ఇది 11వ సెంచరీ కావడం విశేషం.