/rtv/media/media_files/2025/07/23/kl-rahul-1000-runes-2025-07-23-21-24-42.jpg)
మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు.ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ గడ్డపై 1000 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేసిన ఐదో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సునీల్ గవాస్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఓపెనర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.
Indians who’ve conquered foreign soils! 🔥
— Sportskeeda (@Sportskeeda) July 23, 2025
KL Rahul joins the list of Indian greats with 1000+ Test runs in away countries, with his milestone coming in England 🏴👏#ENGvIND#KLRahul#TestCricket#Sportskeedapic.twitter.com/3HThmVzuDP
ఇంగ్లాండ్ గడ్డపై 1000+ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ల జాబితా:
సచిన్ టెండూల్కర్ (1575 పరుగులు)
రాహుల్ ద్రవిడ్ (1376 పరుగులు)
సునీల్ గవాస్కర్ (1152 పరుగులు)
విరాట్ కోహ్లీ (1096 పరుగులు)
కేఎల్ రాహుల్ (1000+ పరుగులు)
నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. 60 ఓవర్లకు జట్టు స్కోరు 3 వికెట్లకు 182 గా ఉంది. సాయిసుదర్శన్ (39), రిషబ్ పంత్ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (12), యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) పరుగుల వద్ద ఔటయ్యారు. సిరీస్ చేజారకూడదంటే భారత్ ఈ మ్యాచ్ లో తప్పకుండా లేదా డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది.