Team India: ఐసీసీ వన్డే ర్యాంకులు.. టాప్‌ 2లో ఉన్న టీమిండియా స్టార్ క్రికెటర్లు!

ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ మొదటి ప్లేస్‌లో నిలిచారు. 784 పాయింట్లతో శుభ్‌మన్ మొదటి ప్లేస్‌లో ఉండగా, రోహిత్ శర్మ 756 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచారు. పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ 751 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

New Update
ICC

ICC

ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ మొదటి ప్లేస్‌లో నిలిచారు. 784 పాయింట్లతో శుభ్‌మన్ మొదటి ప్లేస్‌లో ఉండగా, రోహిత్ శర్మ 756 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచారు. ఐపీఎల్ తర్వాత రోహిత్ శర్మ ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. అయినా కూడా టాప్ 2లో ఉన్నారు. అయితే పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ 751 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో అజామ్ బ్యాటింగ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో మూడో స్థానంలోకి వచ్చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 736 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ 708 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలవగా కేఎల్ రాహుల్ 15వ స్థానంలో నిలిచాడు.

ఇది కూడా చూడండి: PAK vs WI : పరువు తీసుకున్న పాక్..  34 ఏళ్ల తరువాత సొంతగడ్డపై

రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత..

వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. ప్రస్తుతం వీళ్లు ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రాక్టీస్ అవుతున్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మధ్య మూడు వన్డేల సిరీస్ అక్టోబర్ 19వ తేదీ నుంచి 25 వరకు జరగనుంది. టీ20 టెస్ట్ సిరీస్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్, రోహిత్ శర్మ ఈ వన్డే క్రికెట్‌పై కాస్త దృష్టి పెట్టారు. 

784 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఉన్నారు. రెండో ప్లేస్‌లో రోహిత్‌ శర్మ 756 పాయింట్లతో ఉన్నారు. ఇక వరుస స్థానాల్లో బాబర్‌ అజామ్‌ 751 పాయింట్లు, విరాట్‌ కోహ్లీ 736 పాయింట్లు, డారిల్‌ మిచెల్‌ 720 పాయింట్లు, చరిత్‌ అసలంక 719 పాయింట్లు, హ్యారీ టెక్టర్‌ 708 పాయింట్లు, శ్రేయస్‌ అయ్యర్‌ 704 పాయింట్లు, ఇబ్రహీం జద్రాన్ 676 పాయింట్లు, కుశాల్‌ మెండిస్‌ 669 పాయింట్లతో ఉన్నారు. 

ఇది కూడా చూడండి:Shubman Gill: ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా శుభ్‌మన్‌.. ఒక్క టెస్టుకే రికార్డులు కొల్లగొడుతున్న కెప్టెన్ గిల్

Advertisment
తాజా కథనాలు