/rtv/media/media_files/2025/07/12/kl-rahul-broke-virender-sehwag-big-record-ind-vs-eng-3rd-test-series-2025-07-12-19-03-36.jpg)
kl rahul broke virender sehwag big record ind vs eng 3rd test series
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. మూడో టెస్ట్ మ్యాచ్ జూలై 10 నుండి లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ఆడి.. 387 పరుగులకు ఆలౌట్ అయింది.
ind vs eng 3rd test match
ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ఈ ఇన్నింగ్స్‌లో KL రాహుల్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. భారతదేశం తరపున మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ అర్ధ సెంచరీ సాధించి వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. ఏడు దేశాలలో ఈ ఘనత సాధించిన భారతదేశం నుండి రెండవ బ్యాట్స్‌మన్‌గా, ఆసియా నుండి మూడవ బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు.
Also Read: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!
కేఎల్ రాహుల్ తన అజేయ అర్ధసెంచరీతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాల్లో టెస్ట్ మ్యాచ్‌లలో ఓపెనర్‌గా 11వ సారి 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాడు. దీంతో అతడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న (10) రికార్డును బద్దలు కొట్టాడు.
Also Read: రజినీకాంత్ ‘కూలీ’ నుంచి పూజాహెగ్డే ఊరమాస్ సాంగ్.. గూస్‌బంప్స్ స్టెప్పులతో రప్పా రప్పా
వీరేంద్ర సెహ్వాగ్ SENA దేశాలలో మొత్తం 10 సార్లు 50+ పరుగులు చేశాడు. కానీ ఇప్పుడు రాహుల్ 11 సార్లు 50+ పరుగులు చేసి సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ లిస్ట్‌లో ఏడు దేశాలలో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. అతను ఈ ఘనతను 19 సార్లు చేశాడు. దిముత్ కరుణరత్నే రెండవ స్థానంలో ఉన్నాడు. అతను మొత్తం 12 సార్లు 50+ స్కోర్ చేసిన ఘనతను సాధించాడు. ఇప్పుడు రాహుల్ మూడవ స్థానంలో ఉన్నాడు. అతను 11 సార్లు 50+ స్కోర్ చేసిన ఘనతను సాధించాడు.
వీరేంద్ర సెహ్వాగ్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. దీనితో పాటు పాకిస్తాన్‌కు చెందిన సయీద్ అన్వర్ ఐదవ స్థానంలో, తమీమ్ ఇక్బాల్ ఆరో స్థానంలో ఉన్నారు. గతంలో కూడా కేఎల్ రాహుల్ SENA దేశాల్లో సెంచరీలు, అర్ధసెంచరీలు సాధించి తన సత్తా చాటాడు. ఈ తాజా రికార్డుతో టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా అతని విలువ మరింత పెరిగింది.