India vs South Africa: సౌత్ ఆఫ్రికాతో వన్డేలకు కెప్టెన్ గా అతనే..బీసీసీఐ షాకింగ్ డెసిషన్?

సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సీరీస్ కు కెప్టెన్ గా ఎవరూ ఊహించిని పేరును బీసీసీఐ ప్రకటిస్తుందని తెలుస్తోంది. గాయపడిన శుభ్ మన్ గిల్ కు వన్డే సీరీస్ లో కూడా రెస్ట్ ఇచ్చి..రోహిత్ శర్మను కానీ, వికెట్ కీపర్ కె.ఎల్. రాహుల్ కానీ నియమించే అవకాశం ఉందని సమాచారం.

New Update
rohith, rahul

India vs South Africa: ప్రస్తుతం భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ పీరీస్ అవుతోంది. మొదటి టెస్ట్ లో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది. నవంబర్ 22న రెండో టెస్ట్ జరగనుంది. అయితే ఈ టెస్ట్ లకు కెప్టెన్ శుభ్ మన్ గిల్ దూరంగా ఉన్నాడు. మెడకు గాయంతో మొదటి టెస్ట్ కూడా ఆడలేదు. ప్రస్తుతం అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ డాక్టర్లు రెండు వారాలు రెస్ట్ తీసుకోమనడంతో రెండో టెస్ట్ కు కూడా దూరమయ్యాడు. గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Also Read: ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో దారుణం.. ఉదయాన్నే భార్య గొంతు కోసి.. పిల్లలను నరికి..!

వన్డేల్లోనూ రెస్ట్..

టెస్ట్ సీరీస్ తర్వాత ప్రొటీస్ టీమ్ తో టీమ్ ఇండియా వన్డే సీరీస్ కూడా ఆడనుంది. అయితే కెప్టెన్ గిల్ కు ఇందులో కూడా రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న అతనికి రెస్ట్ ఇస్తేనే మంచిదన్న భావనలో ఉంది.  అత‌డితో పాటు వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్ కూడా వ‌న్డేల‌కు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా టూర్ లో గాయ‌ప‌డ్డ శ్రేయస్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌లేదు. అందుకే అత‌డిని ఆడించి రిస్క్ తీసుకోకూడదని సెలెక్టర్లు యోచిస్తున్నారు. వీరద్దరితో పాటు బుమ్రా, హార్దిక్‌ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 రోహిత్ లేదా రాహుల్..

ఈ క్రమంలో వన్డే సీరీస్ పగ్గాలు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటోందని తెలుస్తోంది.  చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఒకవేళ రోహిత్ ఒప్పుకోకపోతే..వికెట్ కీపర్ కే ఎల్ రాహులన్ కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. వ‌న్డే సిరీస్‌కు టీమిండియా జట్టు సెలక్షన్ కమిటీ ఒక‌టి, రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. వ‌న్డే టీంలోకి య‌శ‌స్వి జైశ్వాల్‌, సాయి సుదర్శన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. న‌వంబ‌ర్ 30వ తేదీ నుంచి రాంచీ వేదిక‌గా ఈ 3 వ‌న్డేల సిరీస్ స్టార్ట్ కానుంది.

Also Read: ఢిల్లీ బాస్ట్ కేసులో కొత్త మలుపు.. ఉమర్ తో సంబంధం ఉన్న మరో ఇద్దరి అరెస్ట్

Advertisment
తాజా కథనాలు