BREAKING : కేఎల్ రాహుల్ గుడ్ న్యూస్..  ఆడబిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి

భారత స్టార్  క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఈ జంట మార్చి 24, సోమవారం రోజున అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

New Update
baby girl

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులకు ఆడపిల్ల పుట్టింది.  మార్చి 24వ తేదీ సోమవారం రోజున అతియా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  ఈ విషయాన్ని రాహుల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.  ఈ దంపతులకు ఆడబిడ్డ పుట్టడంతో అభిమానులు, సెలబ్రిటిలు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

2023లో వివాహ బంధంతో

 కాగా ప్రేమికులైన ఈ జంట 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 8, 2024న తాను గర్భం దాల్చినట్లు  అతియా శెట్టి  సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక క్రికెట్ విషయానికొస్తే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్నాడు.  ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ కు అతను దూరంగా ఉన్నాడు. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరుపున ఆడిన రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. 

Advertisment
తాజా కథనాలు