Air India: తెరుచుకోని ఎయిరిండియా ఫ్లైట్ డోర్లు.. భయాందోళనలో ప్రయాణికులు
ఢిల్లీ-రాయ్పూర్ ఎయిరిండియా విమానంలో మరో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. విమానం రాయ్పూర్లో ల్యాండ్ అయ్యాక డోర్లు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆ విమానంలో ఓ ఎమ్మెల్యేతో పాటు 160 మంది ప్రయాణికులు ఉన్నారు.