BIG BREAKING: అమెరికాకు భారత్ విమాన సర్వీసులు రద్దు

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సెప్టెంబర్ 1 నుంచి ఢిల్లీ-వాషింగ్టన్ డీసీల మధ్య నడిచే నాన్‌స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం నిర్వహణపరమైన అంశాలు అని ఎయిర్ ఇండియా పేర్కొంది.

New Update
Air India to suspend

భారత్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సెప్టెంబర్ 1 నుంచి ఢిల్లీ-, వాషింగ్టన్ డీసీల మధ్య నడిచే నాన్‌స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం నిర్వహణపరమైన అంశాలు అని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, అనుభూతి అందించేందుకు ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌లోని 26 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలకు రెట్రోఫిట్టింగ్ పనులను ప్రారంభించింది. ఈ ఆధునికీకరణ ప్రక్రియ 2026 చివరి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో చాలా విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దీని కారణంగా మొత్తం నెట్‌వర్క్‌లో సర్వీసుల విశ్వసనీయతను కాపాడేందుకు ఈ మార్గంలో విమానాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

పాకిస్తాన్ గగనతలం మూసివేత కూడా ఈ నిర్ణయానికి మరో కారణమని ఎయిర్ ఇండియా తన ప్రకటనలో వెల్లడించింది. పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో అమెరికా వెళ్లాల్సిన ఫ్లైట్స్‌ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. సెప్టెంబర్ 1 తర్వాత ఢిల్లీ టూ -వాషింగ్టన్ మార్గంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్యాసింజర్లను ఎయిర్ ఇండియా సంప్రదిస్తుంది. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రయాణికులు కోరుకుంటే ఇతర విమానాల్లో సీట్లు కేటాయించడం లేదా టికెట్ డబ్బును పూర్తిగా వాపసు చేయడం వంటి ఆప్షన్లు అందిస్తామని పేర్కొంది. వాషింగ్టన్ డీసీకి వెళ్లాలనుకునే ప్రయాణికులు న్యూయార్క్ (JFK), నెవార్క్ (EWR), చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల ద్వారా వన్-స్టాప్ విమానాల్లో వెళ్లవచ్చని ఎయిర్ ఇండియా సూచించింది.

ఈ మార్గంలో సర్వీసులను రద్దు చేసినప్పటికీ, ఎయిర్ ఇండియా ఉత్తర అమెరికాలోని టొరంటో, వాంకోవర్ సహా మరో ఆరు నగరాలకు నాన్‌స్టాప్ సర్వీసులను కొనసాగిస్తుందని తెలిపింది. ఈ నిర్ణయం ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనే దానిపై ఎయిర్ ఇండియా స్పష్టత ఇవ్వలేదు. అయితే, రెట్రోఫిట్టింగ్ పనులు పూర్తయిన తర్వాత సర్వీసులను తిరిగి పునరుద్ధరించవచ్చని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు