/rtv/media/media_files/2025/10/17/food-2025-10-17-20-24-30.jpg)
Madras High Court orders Air India to pay 35,000 compensation to man who found hair in food
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. తనకు ఇచ్చిన భోజనంలో వెంట్రుకలు రావడంతో అతడు షాకైపోయాడు. చివరికి కోర్టులో దీనిపై ఫిర్యాదు చేయగా.. న్యాయస్థానం ఎయిర్ ఇండియాకు చివాట్లు పెట్టింది. బాధిత ప్రయాణికుడికి రూ.35 వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సుందర పరిపూర్ణం అనే ప్రయాణికుడు శ్రీలంక రాజధాని కొలంబో నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నాడు.
Also read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్
ప్రయాణంలో ఉండగా ఆయనకు సిబ్బంది భోజనం వడ్డించారు. ఆయన సగం భోజనం తిన్నాక అందులో వెంట్రుకలు రావడం చూసి కంగుతిన్నాడు. దీనిపై సిబ్బందికి ఫిర్యాదు చేశారు. చివరికి అతడు అనారోగ్యం పాలయ్యాడు. తనకు కలుషిత ఆహారం ఇవ్వడంపై చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ వాళ్లు పట్టించుకోలేదు. దీంతో ఆయన చెన్నై అడిషనల్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారించిన న్యాయస్థానం ప్రయాణికుడికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది.
దీన్ని సవాలు చేస్తూ ఎయిర్ ఇండియా కూడా మద్రాస్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. శుక్రవారం దీనిపై జస్టిస్ బాలాజీ విచారణ జరిపారు. అయితే ప్రయాణికుడికి వడ్డించిన ఆహారంలో వెంట్రుకలు ఉన్నట్లు ఎయిర్ ఇండియా తరఫు న్యాయవాదులు అంగీకరించారు. దీనికి తాము విచారిస్తున్నామని.. ఆ విమానంలో వడ్డించే ఆహారాన్ని చెన్నైలోని అంబాసిడర్ పల్లవ హోటల్ తయారు చేస్తుందని చెప్పారు. అందువల్ల ఆ హోటల్‌ను కూడా ఈ కేసులో చేర్చాలని కోరారు. దీనికి వాళ్లే బాధ్యత వహించాలని.. ఎయిర్ ఇండియాది మాత్రమే బాధ్యత ఉండదని వాదనలు వినిపించారు.
Also Read: రైతుల వెంటపడ్డ పులి, భయంతో చెట్లెక్కిన స్థానికులు.. వీడియో వైరల్
చివరికి ఎయిర్ ఇండియా వాదనలను హైకోర్టు తిరస్కరించింది. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా తప్పును హోటల్‌పై నెట్టేందుకు యత్నించిందని మండిపడింది. బాధిత ప్రయాణికుడికి సివిల్ కోర్టు విధించిన రూ.1 లక్ష పరిహారాన్ని తగ్గించి.. రూ.35 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.