Delhi: ప్రయాణికుడిపై పైలట్ దాడి.. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన ఎయిరిండియా

ఢిల్లీ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి వెళ్లిన అంకిత్ అనే అతనిపై పైలట్ దాడి చేశాడు. దీంతో అతను ఆవేదన చెంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

New Update
delhi

delhi

ఢిల్లీ విమానాశ్రయం(delhi-airport) లో ఓ ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్(air india pilot) దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంకిత్ దివాన్ అనే ప్రయాణికుడు తన భార్య, 7 ఏళ్ల కుమార్తె, నాలుగు నెలల పసిపాపతో కలిసి ప్రయాణించేందుకు వచ్చారు. ఈ క్రమంలో చిన్న పిల్లలు ఉన్నందున భద్రతా సిబ్బంది వారిని స్టాఫ్ కోసం కేటాయించిన లైన్‌లో వెళ్లమని టెర్మినల్-1 వద్ద సూచించారు. ఆ లైన్‌లో వెళ్తున్న సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్ కెప్టెన్ వీరేంద్ర అక్కడకు వచ్చారు.

ప్రయాణికుడిపై దాడి చేసిన పైలట్..

అంకిత్ దివాన్ తన కుటుంబంతో లైన్‌లో ఉన్నప్పుడు పైలట్ వీరేంద్ర వారిని చూసి అసహనం వ్యక్తం చేశారు. మీరు చదువుకోలేదా? ఇది సిబ్బంది కోసం కేటాయించిన లైన్ అని తెలియదా అంటూ దురుసుగా మాట్లాడారు. దానికి ప్రయాణికుడు సమాధానం ఇస్తుండగానే.. పైలట్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. కేవలం మాటలతో ఆగకుండా అంకిత్ దివాన్‌పై శారీరక దాడికి దిగారు. ఈ దాడిలో అంకిత్ దివాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని ముక్కు, నోటి నుంచి రక్తం కారి పైలట్ చొక్కాపై కూడా పడింది. ఈ ఘటనను అంకిత్ ఏడేళ్ల కుమార్తె కూడా చూసింది. తన తండ్రిని ఒక వ్యక్తి అలా కొడుతుండటంతో ఆ చిన్నారి తీవ్రమైన భయాందోళనకు గురైంది. 

ఇది కూడా చూడండి: BEAKING: తెలంగాణలో దారుణ హత్య.. కత్తులు స్కూడ్రైవర్లతో పొడిచి..

ఈ సంఘటన వల్ల తన కుటుంబం అంతా తీవ్రమైన మానసిక వేదనకు గురైందని, తన సెలవుల ప్లాన్ మొత్తం పాడైపోయిందని అంకిత్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్‌ను కూడా డిలీట్ చేసినట్లు అంకిత్ తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం వెంటనే స్పందించింది. తమ పైలట్ ప్రవర్తన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పింది. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు సదరు పైలట్ కెప్టెన్ వీరేంద్రను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది ప్రవర్తన విషయంలో తమ సంస్థ ఎప్పుడూ కఠినంగా ఉంటుందని వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు