/rtv/media/media_files/2025/08/25/air-india-flight-2025-08-25-11-12-40.jpg)
Air india Flight
ఈ మధ్యకాలంలో ఎయిరిండియా విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గాల్లో ఉన్న ఓ ఎయిరిండియా విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ రావడం కలకలం రేపింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన విమాన సిబ్బంది సమస్యను పరిష్కరించారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా ఓ మహిళా ప్రయాణికురాలు అస్వస్థకు గురైంది. ఆమె ముక్కు నుంచి విపరీతంగా రక్తస్రావం వచ్చింది.
Also Read: ఆఫీస్‌లో అదనపు గంటలు పనిచేస్తున్నారా ? సర్వేలో షాకింగ్ నిజాలు
దీంతో ప్రయాణికులు షాకైపోయారు. ఎయిరిండియా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. విమానాశ్రయ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. మెడికల్ ఎమర్జెన్సీ దృష్ట్యా పైలట్లు 16 నిమిషాల ముందే విమానాన్ని బెంగళూరులో కెంపెగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఆమెకు వెంటనే వైద్య చికిత్స అందించారు. అత్యవసర సమయంలో విమాన సిబ్బంది వ్యవహరించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రష్యాకు మరో షాక్.. ఉక్రెయిన్‌కు మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా
ఇదిలాఉండగా ఇటీవల గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాత ఎయిరిండియా విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు లోపాలు సంభవించడం ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వల్ల విమానాలు రద్దు కావడం, ఆలస్యంగా బయలుదేరడం లేదా గమ్యస్థానానికి వెళ్లే మార్గంలో వెనక్కి మళ్లించడం లాంటివి జరుగుతున్నాయి. ఈ వరుస ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్
గత కొన్ని నెలలుగా ఎయిర్ ఇండియాకు చెందిన చాలా విమానాల్లో అధికారులు సాంకేతిక లోపాలు గుర్తించారు. ఇంజిన్లలో సమస్యలు, క్యాబిన్‌లో ఉష్ణోగ్రత పెరగడం, ల్యాండింగ్ గేర్‌లో లోపాలు వంటివి ప్రధానంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందు లోపాలు గుర్తించడంతో విమానాలు రద్దు చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), భారతదేశంలో విమానయాన రంగం భద్రతను పర్యవేక్షించే సంస్థ అని తెలిసిందే.
DCGA కూడా ఎయిర్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వరుస లోపాలను గమనించి.. ఎయిర్ ఇండియా సంస్థకు భద్రతా ప్రమాణాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. విమానాల్లో చోటుచేసుకుటున్న లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించింది. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత, ఎయిర్ ఇండియాలోని ముగ్గురు సీనియర్ అధికారులను కూడా తొలగించాలని డీజీసీఏ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read: వాషింగ్టన్ తరువాత షికాగో లో సైనిక మోహరింపు..ఆలోచనలో పెంటగాన్