/rtv/media/media_files/2025/08/11/air-india-flight-door-fails-to-open-at-raipur-airport-2025-08-11-14-38-38.jpg)
Air India Flight Door Fails To Open At Raipur Airport
ఢిల్లీ-రాయ్‌పూర్ ఎయిరిండియా విమానంలో మరో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. విమానం రాయ్‌పూర్‌లో ల్యాండ్ అయ్యాక డోర్లు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆ విమానంలో ఓ ఎమ్మెల్యేతో పాటు 160 మంది ప్రయాణికులు ఉన్నారు. గంటకు పైగా అందులోనే చిక్కుకుపోయారు. ఆదివారం రాత్రి రాయ్‌పూర్‌లో స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Air India Flight Door Fails To Open At Raipur Airport
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎయిరిండియాకు చెందిన AI 2797 విమానం ఆదివారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరింది. రాత్రి 10.05 గంటలకు రాయ్‌పూర్‌లో ల్యాండ్ అయ్యింది. అక్కడ సురక్షితంగానే ల్యాండ్ అయ్యింది. కానీ విమాన డోర్లు తెరుచుకోకపోడవం కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు బయటకు రాలేక భయాందోళనకు గురయ్యారు. ఈ ఫ్లైట్‌లో బిలాస్‌పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అటల్ శ్రీవాస్తవ కూడా ఉన్నారు.
Also Read: వీధి కుక్కలను అక్కడికి తరలించండి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అయితే దాదాపు గంట సేపు విమాన డోర్లు తెరుచుకోకపోవడం, అందులోని సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో భయాందోళన మొదలైంది. అలాగే విమానం లోపల విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. దీంతో ప్రయాణికుల్లో మరింత భయం పట్టుకుంది. పరిస్థితులు గందరగోళంగా మారడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది స్పందించారు. సాంకేతిక లోపం వల్లే ఈ డోర్ తెరుచుకోలేదని తెలిపారు. చివరికి రాత్రి 11 గంటల తర్వాత టెక్నికల్ సమస్యను సరిచేశారు. ఆ తర్వాత ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగారు.
Also Read: ఐదుగురు జర్నలిస్టులను చంపేసిన ఇజ్రాయెల్ సైన్యం..హమాస్ టెర్రరిస్టులని నెపం
ఇదిలాఉండగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియోషన్ (DGCA) సోమవారం మధ్యాహ్నం దాకా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ మధ్యకాలంలో వరుసగా ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు రావడం కలకలం రేపుతోంది. స్పైస్‌జెట్, ఇండిగో ఫ్లైట్లలో కూడా ఇలా సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ఆ విమానాలను వెనక్కి మళ్లించడం, అత్యవసర ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నారు. ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 260 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
Passengers Stranded At Raipur Runway As Air India Flight Door Fails To Open https://t.co/EOZ31suv3Vpic.twitter.com/wFnPTAiNxJ
— NDTV (@ndtv) August 11, 2025
Also Read: అమెరికాలో ఇంటిపై పడిన ఉల్క.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు!