BIG BREAKING: ఎయిరిండియా ఫ్లైట్ హైజాక్ కు కుట్ర.. ఆ 8 మంది ఎవరు?

బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌ డోర్‌ తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించారు. హైజాక్ అవుతందనే భయంతో పైలట్‌ డోర్‌ తెరవలేదు.

New Update

బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌ డోర్‌ తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించారు. హైజాక్ అవుతందనే భయంతో పైలట్‌ డోర్‌ తెరవలేదు. ఆ తర్వాత పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: అమెరికా హెచ్ 1బీ వీసాకు పోటీగా చైనా కె వీసా.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎయిరిండియా ఫ్లైట్‌ IX1086 సోమవారం ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి టేకాఫ్‌ అయ్యింది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు పైలట్లు ఉండే కాక్‌పీట్‌ డోర్‌ వద్దకు వచ్చాడు. దాన్ని తెరిచేందుకు యత్నించాడు. ఆ డోర్‌ ఓపెన్ చేయాలంటే పాస్‌కోడ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కెప్టెన్‌ బయటివాళ్లని లోపలికి అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆ  ప్రయాణికుడు కాక్‌పీట్‌ డోర్‌ను యాక్సెస్‌ చేయలేకపోయాడు. దీంతో అక్కడున్న సిబ్బంది అతడిని పట్టుకొని తన సీట్లో కూర్చోబెట్టారు. అయితే ఆ ప్రయాణికుడు కాక్‌పీట్‌ డోర్‌ను తెరిచేందుకు ఎందుకు యత్నించాడనే దానిపై క్లారిటీ లేదు.    

Also Read: అఫ్గానిస్థాన్‌కు మళ్లీ అమెరికా బలగాలు ?.. ట్రంప్ సంచలన వార్నింగ్‌

 అతడితో పాటు మరో ఏడుగురు కూడా వెంట ఉన్నారు. చివరికి ఆ విమానాన్ని వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ చేశాక ఆ ఎనిమిది మంది ప్రయాణికులను సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించారు. ఆ ఏడుగురి ప్రయాణికుల లగేజ్‌ను కూడా CISF సిబ్బంది చెక్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎయిరిండియా కూడా స్పందించింది. ఓ ప్రయాణికుడు కాక్‌పీట్‌ డోర్‌ తెరిచేందుకు యత్నించాడని మీడియా వార్తల ద్వారా తెలుసుకున్నామని పేర్కొంది. భద్రతా విషయంలో తాము రాజీపడేది లేదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు విషయాన్ని తెలియజేశామని దీనిపై విచారణ సాగుతోందని తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు