/rtv/media/media_files/2025/09/04/air-india-plane-2025-09-04-10-29-31.jpg)
air India plane
Air India Flight: గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, పైలెట్ సిబ్బంది విమానాన్ని రన్వేపై సేఫ్ లాండింగ్ చేశారు. విమానంలో వందమంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమానం లో తలెత్తిన లోపాన్ని సరిచేయడానికి సుమారు 2, 3 గంటలు సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులకు త్యామ్నాయ ఫ్లైట్ను ఏర్పాటు చేశారు.
గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
— RTV (@RTVnewsnetwork) September 4, 2025
గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి బెంగళూరు వెళుతుండగా టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఫ్యాను రెక్కలకు తగిలిన పక్షి....
ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోవడంతో అప్రమత్తం అయిన పైలెట్....
చకచక్యంగా గన్నవరం… pic.twitter.com/cQ02hXKUk8
Also Read: BIGG BOSS TELUGU: రచ్చ రచ్చే.. ప్రభాస్ హీరోయిన్ తో పాటు బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!