Air India Flight: విశాఖ-హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా ఏదో ఒక ప్రాబ్లెమ్ వస్తూనే ఉన్నాయి. తాజాగా వైజాగ్ నుంచి హైదరాబాద్ కు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.  ఏం జరిగిందో తెలుసా..

New Update
Air India

ఆకాశంలో ఎగిరే విమానాలకు పెద్ద శత్రువులు పక్షులు. వీటి కారణంగా చాలా ఫ్లైట్స్ ప్రమాదాలకు గురవుతుంటాయి. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి ఓ పక్షి ఆటంకం కలిగించింది.  విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న విమానం రెండో ఇంజిన్ లోకి పక్షి దూరిపోయింది. దాంతో అది అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో పైలెట్లు చాలా ఇబ్బంది ఎదుర్కొననారు. గాల్లో ఉండగా ఇది జరగడంతో ఏం చేయాలో కాసేపు తెలియలేదు. వెంటనే దించడానికి కూడా వీలు అవదు. ఈ పరిస్థితుల్లో పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని..

పక్షి వలన ఫ్లైట్ కు ఏమీ అవకుండా 3 గంటల సమయంలో విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇందులో 103 ప్యాసెంజర్లు ఉన్నారు.  ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అవడంతో అందరూ ష్ట్రపిరి పీల్చుకున్నారు. కానీ మూడు గంటలు మాత్రం ఏం జరుగుతుందో తెలియక..తమ ప్రాణాలు ఉంటాయో లేదో అని నరకం అనుభవించారు. ఈ సంఘటన ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిందని తెలుస్తోంది.  దీని తరువాత  ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. 

Advertisment
తాజా కథనాలు