Gongadi Trisha: గొంగడి త్రిషకు ఐసీసీ అవార్డు
గొంగడి త్రిష జనవరి నెలకు గాను ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు రేసులో నిలిచింది. ఇటీవల మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో అల్‌రౌండర్‌గా అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు భారత్ టైటిల్ గెలవడంలో త్రిష కీలకపాత్ర పోషించింది.
Jasprit Bumrah: టీమిండియా క్రికెటర్ బుమ్రాకు అరుదైన గౌరవం.. తొలి బౌలర్ గా రికార్డు
భారత స్టార్ పేసర్ బుమ్రాను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. 2024 ఏడాదికిగానూ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బుమ్రా సెలెక్ట్ అయ్యాడు. దీంతో ఈ అవార్డు పొందిన ఆరో భారత క్రికెటర్‌గా.. తొలి బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు.
ICC AWARDS 2024: టెస్టుల్లో ఈ ఇద్దరికే.. వన్డేల్లో ఒక్కరు లేరు!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 అవార్డ్స్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. టెస్టులు, వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11మంది పురుషులు, మహిళా ప్లేయర్ల లిస్ట్ రిలీజ్ చేసింది. జైస్వాల్, జడేజా, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు.
Jay Shah: జై షాకు బంపర్ ఆఫర్.. WCCలో చోటు!
ఐసీసీ ఛైర్మన్ జై షాకు అరుదైన అవకాశం లభించింది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (WCC) సలహా మండలిలో చోటు దక్కింది. ఈయనతోపాటు సౌరభ్ గంగూలీ, అనురాగ్ దహియా, సంజోగ్ గుప్తాలకు అవకాశం కల్పించారు. మొదటి సమావేశం జూన్ 7, 8న లార్డ్స్ లో జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీపై వీడిన సస్పెన్స్.. ఐసీసీ అధికారిక ప్రకటన రిలీజ్!
2025 ఛాంపియన్స్ ట్రోఫీపై సస్పెన్స్ వీడింది. హైబ్రిడ్ మోడల్లోనే మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. టీమ్ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లట్లేదని, 2024-27 భారత్, పాక్ ఐసీసీ ఈవెంట్లన్నీ హైబ్రిడ్ మోడల్లోనే జరుగుతాయని స్పష్టం చేసింది.
ICC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా..
ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు చేపట్టారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో వ్యక్తి జైషా కావడం విశేషం. జైషా ఈ పదవిలో దాదాపు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ పదవిలో భారత్ నుంచి చివరిగా శశాంక్ మనోహర్ 2015 నుంచి 2020 మధ్య ఉన్నారు.
ICC: భారత్ లేకుండానే ఛాంపియన్ ట్రోఫీ.. MEA అధికారిక ప్రకటన
ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడం లేదని MEA అధికారికంగా ప్రకటించింది. అక్కడ భద్రతా సమస్యల రీత్యా బీసీసీఐ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లు ఎంఇఎ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.
భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్
భారత్-ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరగనుంది. పగలు, రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌లో పింక్ బాల్‌ను ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఈ పింక్ మ్యాచ్‌కు వేదిక కానుంది.