BCCI: పాకిస్తాన్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ

ఆసియా కప్ టోర్నీలో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ క్రికెటర్లు భారతీయులను రెచ్చగొట్టే చర్యలు చేశారు. దీనిపై బీసీసీఐ మండిపడుతోంది. దాంతో పాటూ పాక్ ఆటగాళ్ళు రవూఫ్, ఫర్హాన్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

New Update
bcci

ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్ళు భారత జట్టును రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. మ్యాచ్ గెలవలేక వేరే విధంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. అయితే భారత ఆటగాళ్ళు అవేమీ పట్టించుకోకుండా తమ ఆటతోనే బుద్ధి చెప్పారు. అయితే పాక్ ఆటగాళ్ళ ప్రవర్తనపై బీసీసీఐ(bcci) మాత్రం గరంగరంగా ఉంది. రవూఫ్, ఫర్హాన్ లపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది. వారిద్దరూ...భారత్, పాకిస్తాన్ రెండూ దేశాల మధ్యా చిచ్చుపెట్టేలా సైగలు చేశారని చెప్పింది.

Also Read :  దేశం కోసం విలన్ పాత్రలు కూడా చేస్తా.. బ్యాంటింగ్ ఆర్డర్ పై శాంసన్ కీలక కామెంట్స్

కావాలని రెచ్చగొట్టేలా సైగలు..

పాకిస్తాన్ పేసన్హారిస్రవూఫ్ భారత బ్యాటర్ల వికెట్లను తీయలేకపోయాడు. ఆ కోపాన్ని బౌండరీ లైన్ దగ్గర అభిమానుల మీద చూపించాడు. విమానం కూలిపోతున్నట్టుగా సైగలు చేస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 2022 టీ20 ప్రపంచ కప్‌(t20-world-cup) లో భారత్, పాకిస్థాన్(IND vs PAK cricket) మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) రెండు వరుస సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ భారత అభిమానులు ‘విరాట్ కోహ్లీఅని నినాదాలు చేశారు. దానికి బదులుగా రవూఫ్..ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన సైనిక పోరాటంలో ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ చేస్తున్న నిరాధార వాదనలను సూచిస్తూ ఆ పాకిస్థాన్ పేసర్ అభిమానుల వైపు ‘6-0’ అని సైగ చేశాడు. ఆ తర్వాత విమానాలు కూలిపోతున్నట్లు చేతి సైగలు కూడా చేశాడు. ఇక ఫర్హాన్ విషయానికి వస్తే భారత బ్యాటర్ వికెట్ తీసిన తర్వాత అతను గన్ పేలుస్తున్నట్టు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనిపై టీమ్ ఇండియా క్రికెటర్లు అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :  బంగ్లాదేశ్ పై అద్భుత విజయం... ఫైనల్ లోకి టీమ్ ఇండియా

పాకిస్తాన్ ఆటగాళ్ళు ఇలాంటివి చాలా ఎక్కువగానే చేస్తుంటారు. క్రీడలను, రాజకీయాలను కలిపేసి...అవతలి టీమ్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సైగలు చేస్తుంటారు. అయితే ఈసారి బీసీసీఐ దీన్ని తేలికగా తీసుకోదలుచుకోలేదు. అందుకే రవూఫ్, ఫర్హాన్ ఇద్దరి మీద ఐసీసీకి కంప్లైట్ చేయాలని డిసైడ్ అయింది. వారికి జీవితకాలం నిషేధం విధించేలా చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేయనుంది.

Advertisment
తాజా కథనాలు