Ind vs Pak: భారత్‌పై మరోసారి కుట్రకు పాల్పడ్డ పాకిస్తాన్.. మ్యాచ్ గెలిచే సత్తా లేక సాకులు వెతుక్కున్న పీసీబీ

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నామని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. క్రీడా వేదికపై ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని పాక్ ఆరోపిస్తోంది.

New Update
PCB Compliants to sky

PCB Compliants to sky

పాకిస్తాన్ మరోసారి భారత్‌పై కుట్రకు పాల్పడింది. ఇండియాపై మ్యాచ్ గెలవలేక  పీసీబీ సాకులు వెతుక్కుంటోంది. ఆసియా కప్‌ 2025లో భాగంగా భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విజయం తర్వాత టీమిండియా కెప్టెన్‌ సూర్య కుమార్ యాదవ్ పాక్ జట్టుకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

ఇది కూడా చూడండి: World Athletics Championship 2025: నీరజ్ చోప్రాకు నిరాశే.. ఏడేళ్లలో మొదటిసారి ఓటమి

ఇది కూడా చూడండి: Mahieka Sharma : కొత్త మోడల్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఎవరీ మహీకా శర్మ?

పాకిస్తాన్‌పై విజయం పహల్గాం బాధితులకు అంకితం..

అలాగే పాకిస్తాన్‌పై సాధించిన ఈ విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నామన్నారు. దీంతో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. కేవలం సూర్య కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్‌కు మాత్రమే కంప్లైంట్ చేయనున్నట్లు సమాచారం. క్రీడా వేదికపై ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని పాక్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు సూర్యకుమార్ యాదవ్‌పై ఫిర్యాదు చేయనుంది. 

Advertisment
తాజా కథనాలు