/rtv/media/media_files/2025/06/02/xOnZUwdFE9tumgNNvllU.jpg)
2025 Women's Cricket World Cup Schedule release
Womens World Cup: 2025 మహిళా క్రికెట్ ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజైంది.13వ ఎడిషన్ ఉమెన్ 50 ఓవర్ల వరల్డ్ కప్ టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. 8 జట్లు భారత్, శ్రీలంకలోని 5 వేదికల్లో పోటీపడతాయని తెలిపింది.12 సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగి వస్తున్న ప్రపంచకప్ టోర్నీ ఆరంభ వేడుకలు సెప్టెంబర్ 30న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బోర్డ్ స్పష్టం చేసింది.
2025 ICC Women's Cricket World Cup schedule 𝐑𝐄𝐕𝐄𝐀𝐋𝐄𝐃!
— ICC (@ICC) June 2, 2025
Read more ➡ https://t.co/myj2Gfamkv pic.twitter.com/zl3IYWC2e6
ఎం. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఎసిఎ-విడిసిఎ స్టేడియం (విశాఖపట్నం), ఆర్. ప్రేమదాస స్టేడియం (శ్రీలంక, కొలంబో) వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి సెమీఫైనల్ అక్టోబర్ 29న గౌహతి లేదా కొలంబోలో జరుగుతుంది. రెండవ సెమీఫైనల్ అక్టోబర్ 30న బెంగళూరులో జరుగనుంది. అయితే ఈ ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 2న ఆదివారం బెంగళూరు లేదా కొలంబోలో నిర్వహించనున్నారు.
🚨 CHINNASWAMY STADIUM WILL HOST THE FINAL OF WOMEN's WORLD CUP 2025 🚨
— Sunil Kuntal (@Sunilkuntal01) June 2, 2025
- If Pakistan qualify then Colombo will host the final.#ICC #womenworldcup pic.twitter.com/onnDR6tJGw
ఎనిమిది జట్లు ఇవే:
1. భారతదేశం
2. ఆస్ట్రేలియా
3. ఇంగ్లాండ్
4. దక్షిణాఫ్రికా
5. న్యూజిలాండ్
6. శ్రీలంక
7. బంగ్లాదేశ్
8. పాకిస్తాన్
2022లో న్యూజిలాండ్‌లో జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఈవెంట్‌లో 7సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆసీస్ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది.
Mark your calendars 🗓
— ICC (@ICC) June 2, 2025
The dates and venues for key fixtures in the ICC Women's T20 World Cup 2026 have been revealed ⌛
Here's how to register your interest ➡ https://t.co/OQnVXyJbwN pic.twitter.com/7gtoUmGquv
elugu-news | world-cup | today telugu news