ICC : యూఎస్ఏకు బిగ్ షాక్..క్రికెట్‌ సభ్యత్వంపై ఐసీసీ వేటు

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ నిబంధనలను అమలు చేయడంలో విఫలమవుతుందన్న కారణంతో యూఎస్‌ఏ క్రికెట్‌ (USA Cricket) సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తూ ఐసీసీ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సస్పెన్సన్‌ వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

New Update
ICC

ICC

USA Cricket : ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ నిబంధనలను అమలు చేయడంలో విఫలమవుతుందన్న కారణంతో యూఎస్‌ఏ క్రికెట్‌ (USA Cricket) సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తూ ఐసీసీ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సస్పెన్సన్‌ వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. యూఎస్‌ఏ క్రికెట్‌ బోర్డు ఐసీసీ నిబంధనలను అమలు చేయడంలో తరచూ విఫలమవుతోందని ఐసీసీ వెల్లడించింది.  కాగా వచ్చే ఒలింపిక్స్‌-2028లో  క్రికెట్‌ను కూడా భాగం చేసిన విషయం తెలిసిందే. అయితే, యూఎస్‌ఏ ఒలింపిక్‌తో పాటు పారా ఒలింపిక్స్‌ కమిటీలో గుర్తింపు పొందడానికి  ఆశించిన మేర యూఎస్‌ఏ క్రికెట్‌ బోర్డు ప్రయత్నాలు  ఫలితాలు ఇవ్వట్లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ కారణంగానే అమెరికా క్రికెట్‌ సభ్యతాన్ని నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది. ఈ వైఖరి మూలంగా అమెరికాతోపాటు ప్రపంచ క్రీడల ప్రతిష్ట దెబ్బ తింటుందని మండిపడింది. అయితే, అమెరికా జట్టుకు ఒలింపిక్స్‌, ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.

ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలోఉపరితల ఆవర్తనం...ఎల్లుండి మరోసారి భారీ వర్షం

Advertisment
తాజా కథనాలు