Bismillah Jan Shinwari : అంతర్జాతీయ క్రికెట్ లో తీవ్ర విషాదం.. బిస్మిల్లా జాన్ షిన్వారీ కన్నుమూత!

అంతర్జాతీయ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 41 సంవత్సరాల వయసులో అంపైర్‌ బిస్మిల్లా జాన్ షిన్వారీ తుదిశ్వాస విడిచారు. బిస్మిల్లా జాన్ షిన్వారీ  కొంతకాలంగా అనారోగ్య  సమస్యలతో బాధపడుతున్నారు.

New Update
Bismillah Jan Shinwari

అంతర్జాతీయ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 41 సంవత్సరాల వయసులో అంపైర్‌ బిస్మిల్లా జాన్ షిన్వారీ తుదిశ్వాస విడిచారు. బిస్మిల్లా జాన్ షిన్వారీ  కొంతకాలంగా అనారోగ్య  సమస్యలతో బాధపడుతున్నారు.  కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌లోని పెషావర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ జూలై 7న ఆయన కన్నుమూశారు.  

Also Read :  దేశ రాజధానిలో భారీ భూకంపం.. వణికిన ఢిల్లీ

Also Read :  ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు..ట్రంప్ వల్లే..

21 టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్

షిన్వారీ 25 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. 2017 డిసెంబర్‌లో షార్జాలో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. మంగళవారం షిన్వారీకి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నివాళులర్పించింది. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో షిన్వారీ అద్భుతమైన విజయాలు సాధించారు. 

Also Read :  ఎంతకు తెగించావ్రా ప్రిన్సిపాల్.. పీరియడ్స్‌లో ఉన్నారో లేదో చెక్‌ చేయడానికి బాలికల బట్టలిప్పి!

ICC అధ్యక్షుడు జై షా సహా పలువురు షిన్వారీ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు. షిన్వారీ అంత్యక్రియలు ఆఫ్ఘనిస్తాన్ లోని నంగర్హార్ ప్రావిన్స్‌లో జరిగాయి. ఆయనకు ఐదుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. 

Also Read :  మరోసారి ఆసుపత్రికి కేసీఆర్

jay-shah | afganisthan

Advertisment
Advertisment
తాజా కథనాలు