Asia Cup 2025: షేక్ హ్యాండ్ వివాదం.. పాకిస్తాన్‌కు రూ.454 కోట్లు లాస్!

ఆసియా కప్‌ 2025లో పాక్ జట్టుకు భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోడంతో తీవ్ర వివాదమైంది. దీనిపై చర్యలు తీసుకోకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాక్ ఐసీసీని బెదిరించింది. ఒకవేళ తప్పుకుంటే రూ. 454 కోట్లు(16 మిలియన్ల అమెరికా డాలర్లు) ఆదాయం కోల్పోయినట్లే.

New Update
Pakistan

Pakistan

ఆసియా కప్‌ 2025(Asia cup 2025) లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా(team-india) ఘన విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన అనంతరం భారత జట్టు పాక్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో తీవ్ర వివాదమైన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ ఐసీసీ(icc) పట్టించుకోలేదు. చివరకు టోర్నీ నుంచి తప్పకుంటామని కూడా బెదిరించింది. కానీ ఐసీసీ స్పందించలేదు. అయితే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమని, పెద్ద నేరం చేసినట్లు పాకిస్తాన్ వివాదం సృష్టించింది. భారత జట్టుపై చర్యలు తీసుకోవడంతో పాటు మ్యాచ్ రిఫరీని కూడా తొలగించాలని పాక్ డిమాండ్ చేసింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ రూల్స్ ప్రకారమే నడుచుకున్నారని, అతన్ని తొలగించడం కుదరని ఐసీసీ తెలిపింది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా సమస్యల్లో ఉంది. ఇప్పుడు టోర్నీ నుంచి వైదొలగితే మాత్రం ఆర్థికంగా నష్టపోతామని పాక్ గ్రహించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా దూరం - కారణం ఇదే..!

టోర్నీ నుంచి వైదొలగితే రూ.454 కోట్ల నష్టం..

ఐసీసీపై కోపంతో పాకిస్తాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే దాదాపుగా రూ. 454 కోట్లు(16 మిలియన్ల అమెరికా డాలర్లు) ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. షేక్ హ్యాండ్ వివాదం వల్ల పంతాలకు పోతే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారడం పక్కా. అయితే టోర్నీలో  టెస్ట్ హోదా ఉన్న భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌(ఏసీసీ) వార్షిక ఆదాయం నుంచి 15 శాతాన్ని పొందుతున్నాయి. అసోసియేషన్ నేషన్స్ మరో 25 శాతాన్ని పంచుకుంటున్నాయి. ఇదే కాకుండా ఆసియాకప్ బ్రాడ్ కాస్టింగ్, స్పాన్సర్‌షిప్స్ ఒప్పందాలు, టికెటింగ్ మనీ ద్వారా ఏసీసీకి ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఆసియా కప్ ద్వారానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 12 నుంచి 16 మిలియన్ అమెరికా డాలర్లను ఆర్జించనుంది. ఇవేవి ఆలోచించకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే మాత్రం పీసీబీ ఆర్థికంగా నష్టపోవడం ఖాయం. 

ఇది కూడా చూడండి: Indian Cricket Team: టీమ్ ఇండియాకు కొత్త స్పాన్సర్.. మారనున్న జెర్సీ.. ఎలా ఉంటుందంటే!?

Advertisment
తాజా కథనాలు