/rtv/media/media_files/2025/09/15/pcb-2025-09-15-18-31-56.jpg)
ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత తలెత్తిన 'హ్యాండ్‌షేక్' వివాదం తీవ్ర రూపం దాల్చింది. మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను వెంటనే తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేసింది.
ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Pakistan has decided to boycott further Asia Cup matches until the match referee is removed, as requested by PCB to the ICC. 💪#INDvsPAKpic.twitter.com/1a0FfZurdM
— WaQar Azam Official (@IamWaQarAzam01) September 15, 2025
టాస్ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో హ్యాండ్‌షేక్ చేయవద్దని మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ సూచించారని పీసీబీ ఆరోపించింది. మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై చర్యలు తీసుకోవడంలో మ్యాచ్ రిఫరీ విఫలమయ్యారని పీసీబీ పేర్కొంది. ఈ ఘటనపై పీసీబీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)తో పాటు ఐసీసీకి కూడా అధికారికంగా ఫిర్యాదు చేసింది. పైక్రాఫ్ట్‌ను వెంటనే టోర్నీ నుంచి తొలగించాలని పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ డిమాండ్ చేశారు.
స్పందించిన బీసీసీఐ
అయితే దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ(bcci) అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, క్రీడాస్ఫూర్తికి మించిన కొన్ని విషయాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం బీసీసీఐ, భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తీసుకున్నారని కూడా వెల్లడైంది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో తమ జట్టుకు బీసీసీఐ, ప్రభుత్వ మద్దతు ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.