/rtv/media/media_files/2025/07/14/siraj-2025-07-14-13-30-27.jpg)
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు బిగ్ షాక్ తగిలింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా ఐసీసీ జరిమానా విధించింది. మ్యాచ్ లో 15 శాతం కోతతో పాటుగా ఓ డీమెరిట్ పాయింట్ విధించింది. దీంతో సిరాజ్ డీమెరిట్ పాయింట్ల సంఖ్య 2కు చేరింది.
Mohammed Siraj fined 15% match fee, handed one demerit point for Ben Duckett send-off on Day 4 at Lord's.
— Vaishnav Kv (@vaishnavkv16) July 14, 2025
Siraj admitted to the offense and accepted the sanction, so there was no need for a formal hearing.
#ENGvINDpic.twitter.com/H9m9yz7Q8e
ఆటగాడిపై నిషేధం
కాగా గత 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు వస్తే ఆటగాడిపై నిషేధం విధిస్తారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 23.3 ఓవర్లలో 85 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 31 పరుగులకు మరో రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో రోజు ఆటలో ఈ ఫాస్ట్ బౌలర్ ఓలీ పోప్, బెన్ డకెట్‌లను అవుట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ సిరీస్‌లో రెండు జట్ల నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. 31 ఏళ్ల ఈ బౌలర్ మూడు టెస్టుల్లో 32.00 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు, వాటిలో ఒక ఐదు వికెట్ల మార్క్ ఉంది.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను భారత్ కేవలం 192 పరుగులకే ఆలౌట్ చేసింది. వాషింగ్టన్ సుందర్ కీలక బ్యాటర్లు జో రూట్, జేమీ స్మిత్, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లకు 58 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆట చివరి రోజు గెలవడానికి ఇంకా 135 పరుగులు అవసరం. ఇంగ్లాండ్ గెలుపుకు 6 వికెట్లు అవసరం ఉంది.