Asia Cup 2025: ఆటగాళ్ళు వచ్చేశారు కానీ.. కప్ మాత్రం ఇంకా రాలేదు.. ఏం జరుగుతోంది?

నా చేతి నుంచి ట్రోఫీ తీసుకోలేదు కాబట్టి...దానిని ఎప్పటికీ తిరిగినవ్వని భీష్మించుకుని కూర్చున్నారు పాకిస్తాన్ మంత్రి నఖ్వీ. ఒకరోజు గడిచినా ఇప్పటికీ ట్రోపీ, మెడల్స్ భారత్ ఆటగాళ్ళను చేరుకోలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ..ఐసీసీని కోరనుంది.

New Update
celebrations

ఆసియా కప్(Asia cup 2025) అంతా నాటకీయంగానే గడిచింది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ లు...తరువాత జరిగిన పరిణామాలు అన్నీ ఫుల్ డ్రామాగా అయ్యాయి. చివరగా జరిగిన ఫైనల్ మ్యాచ్ తరువాత కూడా పాకిస్తాన్ మంత్రి నఖ్వీ టోర్నీని ఇవ్వడానికి వేదిక మీదకు రావడం...టీమ్ ఇండియా(team-india) మేము తీసుకోము అని చెప్పింది. నఖ్వీ ఎంత సేపు వెయిట్ చేసినా భారత ఆటగాళ్ళు వేదిక మీదకు వెళ్ళలేదు. దాంతో పాకిస్తాన్ మంత్రి ట్రోఫీతో పాటూ టీమ్ ఇండియాకు ఇవ్వాల్సిన మెడల్స్ కూడా తనతో పట్టుకెళ్ళిపోయారు. అది గడిచి ఒకరోజు పూర్తిగా గడిచిపోయినా ఇంకా అవి భారత్ కు చేరలేదు.  పాకిస్తాన్ మంత్రి నఖ్వీ  పై చర్యలు తీసుకోవాలంటూ బీసీసీఐ(bcci)..ఐసీసీ(icc)ని సంప్రదించాలని నిర్ణయించింది. ట్రోఫీని తీసుకోకపోతే  తరువాత ఎవరైతే గెలిచారో...వారి దేశానికి పంపించేయాలి. కానీ అది ఇంత వరకు భారత్ కు చేరుకోలేదు. 

Also Read :  నేటి నుంచే మహిళల క్రికెట్ ప్రపంచ కప్.. టీమిండియా ఫైనల్ జట్టు ఇదే!

ఏకంగా పట్టుకెళ్ళిపోయాడు..

మొదట నుంచీ పాకిస్తాన్ మంత్రి నఖ్వీ భారత జట్టుకు వ్యతిరేకంగానే ఉన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద ఐసీసీకి ఫిర్యాదు చేయడం వెనుక అతనే ఉన్నాడని చెబుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావాన్ని తెలపడం తప్పు అని చెప్పారు.  ఫైనల్స్ లో కూడా ట్రోఫీని, భారత ఆటగాళ్లకు దక్కాల్సిన పతకాలను తీసుకుని మైదానాన్ని వీడడంతో.. భారత ఆటగాళ్లు బహుమతి లేకుండా సంబరాలు చేసుకున్నారు.  దానికి ముందు నఖ్వీ చేతుల మీదుగా భారత జట్టు ట్రోఫీ తీసుకోదని బీసీసీఐ...ముందే ఏసీసీకి తెలిపింది. కానీ నఖ్వీ తానే ఇస్తానని పట్టుబట్టాడు. దీని వలన బహుమతి ప్రదానం కూడా ఆలస్యం అయింది.  దానికి తోడు పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎవరూ మైదానానికి రాలేదు. అప్పటికే అక్కడ ఉన్న భారత జట్టు...పాకిస్తాన్ మంత్రి కాకుండా ఎవరు ఇచ్చినా టోర్నీ తీసుకుంటామని చెప్పింది. దీంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ ఛైర్మన్ ఖాలిద్ జరూని ట్రోఫీని అందిస్తారని అనుకున్నారు.  కానీ నఖ్వీ అలా జరగనివ్వలేదు.  దీని తరువాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ లాంటి బహుమతులు ఇచ్చారు. పాకిస్తాన్ వాళ్ళు మెడల్స్ అందుకున్నారు. చివరకు ప్రెసెంటేటర్ భారత్ ట్రోఫీ తీసుకోవడం లేదని ప్రకటించగానే...పాకిస్తాన్ మంత్రి తన వెంట ట్రోఫీ తీసుకుని వెళ్ళిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఈ మొత్తం వ్యవహారంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరనుంది.  నఖ్వీ పాకిస్తాన్ ముఖ్య నాయకుల్లో ఒకడని..అందుకే అతని చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి అంగీకరించలేని చెప్పారు. దానర్థం ట్రోఫీని తనతోపాటూ తీసుకెళ్ళమని కాదని బీసీసీఐ అంటోంది. నఖ్వీ చేసిన పని దురదృష్టకమని వ్యాఖ్యానించింది. నఖ్వి ఇలా చేస్తాడని ఊహించలేదు. అతడిది పిల్ల చేష్ట. నవంబరు మొదటి వారంలో జరిగే సమావేశంలో ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని బీసీసీఐ చెప్పింది. 

Also Read :  టీమిండియా విన్నింగ్ మూమెంట్స్.. ట్రోఫీ లేకుండా విజయాన్ని ఎంజాయ్ చేసిన ఆటగాళ్లు.. ఫొటోలు చూశారా?

Advertisment
తాజా కథనాలు