Viral Video: పానీపూరీ కోసం మహిళ ధర్నా.. రోడ్డుకు అడ్డంగా బోరున ఏడుస్తూ
పానీపూరి వ్యాపారి తనకు 2 పానీపూరీలు తక్కువిచ్చాడని ఓ మహిళా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం సోషల్మీడియాలో వైరల్ అయింది. గుజరాత్ వడోదరలో ఈ ఘటన జరిగింది. రూ.20లకు ఆరు పానీపూరీలు ఇస్తానని చెప్పి నాలుగే ఇవ్వడంతో ఆమె రోడ్డుపై వాహనాలకు అడ్డంగా కూర్చోంది.