Viral Video: పానీపూరీ కోసం మహిళ ధర్నా.. రోడ్డుకు అడ్డంగా బోరున ఏడుస్తూ

పానీపూరి వ్యాపారి తనకు 2 పానీపూరీలు తక్కువిచ్చాడని ఓ మహిళా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. గుజరాత్‌ వడోదరలో ఈ ఘటన జరిగింది. రూ.20లకు ఆరు పానీపూరీలు ఇస్తానని చెప్పి నాలుగే ఇవ్వడంతో ఆమె రోడ్డుపై వాహనాలకు అడ్డంగా కూర్చోంది.

New Update
panipuri

పానీపూరి అమ్మేవాడు తనకు రెండు పానీపూరీలు తక్కువిచ్చాడని ఓ మహిళా ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. గుజరాత్‌ వడోదరలో ఈ ఘటన జరిగింది. మొదట రూ.20లకు ఆరు పానీపూరీలు ఇస్తానని చెప్పి నాలుగే ఇవ్వడంతో ఆమె రోడ్డుపై వాహనాలకు అడ్డంగా కూర్చొని నిరసనకు దిగింది. తనకు మిగతా రెండు పానీపూరీలు ఇచ్చే వరకు కదలనని పట్టుబట్టింది. వాహనదారులు జాగ్రత్తగా ఆమె పక్క నుంచి వాహనాలు పోనిచ్చారు.

కొందరు రోడ్డు పక్కన గుంపుగా చేరి ధర్నాని చూస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులు వచ్చాక పరిస్థితి మరింత నాటకీయంగా మారింది. తనకు రూ.20కి ఆరు పానీపూరీలు ఇప్పించాలని ఆమె ఏడుస్తూ పోలీసులను డిమాండ్‌ చేశారు. ఆమె ధర్నాతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చివరికి ఆమెను పోలీసులు అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. అయితే ఆమెకు మిగిలిన రెండు పూరీలు లభించాయో లేదో తెలియలేదు. కానీ ఆమె ఓవర్ నైట్‌లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.

Advertisment
తాజా కథనాలు