Viral Video: 200 ఏళ్ళ నాటి శాపం.. ఆ ప్రాంతంలో చీరలు కట్టుకొని పురుషుల నృత్యాలు!

ప్రాంతాన్ని బట్టి, అక్కడ నివసించే ప్రజల నమ్మకాలను బట్టి  ఆచారాలు, సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. అన్నీ చోట్ల ఒకే విధమైన ఆచారాలు, పట్టింపులు ఉండవు. అలా అహ్మదాబాద్ లోని ఓ గ్రామంలో పురుషులు చీరలు కట్టుకుని గర్భా నృత్యం చేసే ఒక ప్రత్యేకమైన ఆచారం కొనసాగుతోంది.

New Update
viral video

viral video

Viral Video:  ప్రాంతాన్ని బట్టి, అక్కడ నివసించే ప్రజల నమ్మకాలను బట్టి  ఆచారాలు, సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. అన్నీ చోట్ల ఒకే విధమైన ఆచారాలు, పట్టింపులు ఉండవు. అలా అహ్మదాబాద్ లోని ఓ గ్రామంలో పురుషులు చీరలు కట్టుకుని గర్భా నృత్యం చేసే ఒక ప్రత్యేకమైన ఆచారం కొనసాగుతోంది. గత 200 ఏళ్లుగా అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అసలు ఈ ఆచారం ఏంటి? దీని వెనుక ఉన్న కథేంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. 

సదుమాత నీ పోల్ గ్రామం 

గుజరాత్  అహ్మదాబాద్ నగరంలో ఉన్న సదుమాత నీ పోల్ అనే గ్రామంలో ఈ ఆచారం ఉంది. ప్రతి ఏడాది దసరా నవరాత్రుల్లో వచ్చే అష్టమి రోజున ( ఎనిమిదవ రోజున) బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు కట్టుకొని గర్భా నృత్యాలు చేయడం ఇక్కడి సంప్రదాయం/ఆచారం. అయితే 200 సంవత్సరాల నాటి శాపం కారణంగా అక్కడ ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. 

శాపం ఏంటీ 

200 ఏళ్ళ క్రితం ఆ గ్రామంలో సదుబెన్ అనే ఒక స్త్రీ ఉండేదట. అయితే మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఒక అధికారి ఆమెను బలవంతంగా లోబరుచుకోవాలని ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన సదుబెన్ తన బారోట్  కమ్యూనిటీకి చెందిన పురుషులను సహాయం కోసం వేడుకుంటుంది. కానీ, అప్పుడు ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు, ఆమెను ఒంటరిగా వదిలేశారు. దీని కారణంగా సదుబెన్ తన బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర దుఃఖం, కోపంతో రగిలిపోయిన ఆమె తన జాతి పురుషులనంతా శపించింది. వారి భవిష్యత్తు తరాలు కూడా పిరికివాళ్ళుగా ఉంటారని శపించింది. ఆ తర్వాత సదుబెన్ సతీ ఆచారం ప్రకారం తన ప్రాణాలను వదిలేసింది. 

ఇప్పుడు ఆచారంగా 

అప్పుడు తమ పూర్వీకులు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు బారోట్ కమ్యూనిటీ పురుషులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.  అప్పుడు తమకు శాపమిచ్చిన సదుబెన్ మాతను ఇప్పుడు వారు దేవతగా కొలుస్తున్నారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఎనిమిదో రోజు (అష్టమి) నాడు, బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు కట్టుకుని సదుమాత ఆలయం ముందు గర్భా నృత్యం చేస్తారు. పురుషులలో స్త్రీల పట్ల గౌరవాన్ని, వినియాన్ని పెంపొందించడం కూడా ఈ ఆచారం ముఖ్య ఉద్దేశం! ఈ ఆచారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు పురుషులు తమ సంస్కృతి, ఆచారాలకు ఇస్తున్న గౌరాన్ని ప్రశంసిస్తున్నారు.  200 ఏళ్ల సంప్రదాయాన్ని పాటించడం అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు.

Also Read: Akhanda 2 Release Date: ఇక థియేటర్స్ లో బాలయ్య తాండవమే.. అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్

Advertisment
తాజా కథనాలు