/rtv/media/media_files/2026/02/05/gujarat-2026-02-05-16-40-15.jpg)
ఓ ఫాంహౌస్ పార్టీపై గుజరాత్ పోలీసులు రైడ్స్ చేశారు. వడోదర శివార్లలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ లిక్కర్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల్లో 80 మందికి పైగా ప్రముఖులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా, దాదాపు రూ.2.91 కోట్ల విలువైన లగ్జరీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ వంటి డ్రై స్టేట్‌లో ఇలాంటి భారీ మద్యం పార్టీ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
81 people were arrested in a raid at a luxury farmhouse in Goraj village, Ahmedabad, during an anniversary party for allegedly consuming alcohol illegally. #Ahmedabad#PoliceRaidpic.twitter.com/lJkWBaQFBX
— Siddharth Pandya (@siddharthpandy) February 5, 2026
వడోదర నగర శివార్లలోని ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో భారీ ఎత్తున మద్యం పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. గుజరాత్‌లో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ విందు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలతో ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టారు. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున సంగీతం, మద్యం విందు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Ahmedabad, Gujarat: Police raided an illegal liquor party at Nirvana Greens Farmhouse in Ahmedabad district and arrested 81 people. pic.twitter.com/FyyOktNNgk
— IANS (@ians_india) February 5, 2026
ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 80 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, హై-ప్రొఫైల్ సెలబ్రెటీలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులందరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి బ్లెడ్ శాంపిల్స్ సేకరించి, మద్యం సేవించినట్లు నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిబంధనల ప్రకారం, గుజరాత్‌లో అనుమతి లేకుండా మద్యం సేవించడం లేదా నిల్వ చేయడం తీవ్రమైన నేరం. ఈ సోదాల్లో పోలీసులు భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ రూ. 2.91 కోట్లు ఉంటుందని అంచనా. పార్టీకి వచ్చిన వారు వాడిన మెర్సిడెస్, బీఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్లను పోలీసులు సీజ్ చేశారు. భారీ సంఖ్యలో విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లు, క్యాష్, పార్టీ కోసం వినియోగించిన ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను జప్తు చేశారు.
સાણંદના વિકેન્ડ હોમમાં રાખેલી દારૂ પાર્ટીમાં પોલીસ મહેમાન બની , 81 લોકોની ધરપકડ કરી.
— Baroda Mirror (@BarodaMirror) February 5, 2026
.
.
Police turned up as guests at a liquor party held in a weekend home in Sanand and arrested 81 people.#sanand#ahmedabadnews#ahmedabad#barodamirror#barodamirrrornewspic.twitter.com/EgGVMXiAzM
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఫామ్‌హౌస్ యజమానితో పాటు పార్టీ నిర్వాహకులపై కఠిన సెక్షన్ల కింద విచారణ జరుపుతున్నారు. మద్యపాన నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇంత పెద్ద ఎత్తున విదేశీ మద్యం అక్కడికి ఎలా చేరుకుంది? దీని వెనుక ఏవైనా సరఫరా ముఠాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Follow Us