/rtv/media/media_files/2025/09/17/modi-2025-09-17-07-31-38.jpg)
PM Modi
నేడు ప్రధాని మంత్రి నరేంద్రమోదీ(PM Narendra Modi) 75వ పుట్టిన రోజు(PM Modi 76th Birthday). 1950లో గుజరాత్(gujarath) లో పుట్టిన మోదీ నేడు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తి. 75 ఏళ్ల వయస్సులోనూ ప్రధాని మోదీ ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారు. ఎన్ని గంటలు పనిచేసినా కూడా అలసిపోకుండా ఉంటారు. అసలు మోదీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి? ఇన్నేళ్ల వయస్సులోనూ ఆరోగ్యమైన డైట్(healthy-diet) ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మోదీ తీసుకునే ఫుడ్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: PM Modi: అజ్ఞాతంలో ఉండి మోదీ చేసిన సీక్రెట్ ఆపరేషన్ గురించి మీకు తెలుసా?
రోజుకి కొన్ని గంటలు నిద్ర మాత్రమే..
సాధారణంగా మనిషికి రోజుకు 8 నుంచి 9 గంటల నిద్ర అనేది తప్పనిసరి. కానీ ప్రధాని మోదీ మాత్రం రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారని స్వయంగా పలుమార్లు తెలియజేశారు. 8 గంటలు కంటే తక్కువగా నిద్రపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. కానీ ప్రధాని మోదీ తక్కువగా నిద్రపోయినా కూడా ఏం అనిపించదని, రోజంతా యాక్టివ్‌గా ఉంటానని తెలిపారు.
ఎన్ని గంటలకు నిద్రపోయినా..
ప్రధాని మోదీ రాత్రిపూట ఆలస్యంగా ఎన్ని గంటలకు నిద్రపోయినా కూడా ఉదయం తప్పకుండా 4 గంటలకు నిద్రలేస్తారని తెలిపారు. డైలీ ఉదయం తప్పకుండా 4 గంటలకు నిద్రలేచి మొదటిగా యోగా చేస్తానని వెల్లడించారు. ఆ తర్వాత సూర్య నమస్కారం చేసి, ధ్యానం చేస్తారు. లోతుగా శ్వాస తీసుకుంటూ ఇలా మెడిటేషన్ చేస్తారు. అయితే కేవలం ఉదయం మాత్రమే కాకుండా సాయంత్రం సమయాల్లో కూడా మోదీ మెడిటేషన్ చేస్తారట. ఆ తర్వాత సూర్యరశ్మిలో కొంత సమయం వాకింగ్ చేస్తారు. సూర్యుని కిరణాలు బాడీకి తగలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని మోదీ తెలియజేశారు.
సాయంత్రం 6 గంటల తర్వాత..
మోదీ సూర్యాస్తమయం తర్వాత ఫుడ్ అసలు తీసుకోరు. సాయంత్రం 6 గంటలకు ముందే డిన్నర్ చేసేస్తారు. అల్లం టీ, ఉడికించిన ఫుడ్ వంటివి తీసుకుంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రధాని మోదీ ఏ ఫుడ్ కూడా తీసుకోరు. అలాగే అప్పుడప్పుడు మోదీ ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఉపవాసం(Fasting) వల్ల ఇంద్రియాలు అన్ని మరింత చురుగ్గా పనిచేస్తాయని మోదీ వెల్లడించారు. తన జీవితాన్ని ఉపవాసం మార్చిందని మోదీ చెబుతుంటారు.
రోజుకి ఒక మీల్ మాత్రమే..
జూన్ నుంచి నవంబర్ వరకు చాతుర్మాస్ అనే పురాతన భారతీయ సంప్రదాయాన్ని ప్రధాని మోదీ అనుసరిస్తారట. ఈ నెలల పాటు కేవలం రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తానని వెల్లడించారు. అలాగే నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉంటారని తెలిపారు. ఈ తొమ్మిది రోజులు కూడా కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగుతారట. వేడి నీటి వల్ల ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంటారని వెల్లడించారు. అలాగే మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో చైత్ర నవరాత్రి ఉపవాసం కూడా తాను పాటిస్తానని తెలిపారు. ఈ సమయంలో కేవలం పండ్లు మాత్రమే తింటారని వెల్లడించారు. ఇందులో కూడా ఓ ప్రత్యేకత ఉంది. మొదటి రోజు ఏ పండును ఎంచుకుంటే డైలీ కూడా అదే పండును తింటారని మోదీ తెలిపారు.
మునగాకుతో పరోటా
ప్రధాని మోదీ(PM Modi) కి మునగాకు పరోటా అంటే చాలా ఇష్టం. ఈ ఆకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రధాని మోదీ ఎక్కువగా మునగాకు పరోటా తీసుకుంటారు. పరోటాగా కాకపోయినా కూడా ఏదో విధంగా మునగాకు తీసుకుంటారట. ఈ డైట్ వల్ల ప్రధాని మోదీ 75 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారు.
ఇది కూడా చూడండి: Narendra Modi Birthday Special: RSS నుంచి అత్యున్నత పదవి వరకు.. మోదీ అరుదైన ఫొటోలివే!