/rtv/media/media_files/2025/10/07/gujarat-junagadh-honey-trap-case-retired-forest-officer-blackmail-40-lakh-2025-10-07-07-26-39.jpg)
Gujarat junagadh honey trap case retired forest officer blackmail 40 lakh
గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఒక రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి ఆన్‌లైన్ హనీట్రాప్‌లో పడ్డారు. ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. అది హోటల్ గదిలో శృంగారం చేసేంతవరకు వెళ్లింది. ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్ అయ్యానని అతడి నుంచి డబ్బులు గుంజింజి. అక్కడితో ఆగకుండా వారు ప్రైవేట్‌గా కలిసిన వీడియోలు బయటపెడతానని ఆ మహిళ వేరొకరితో బ్లాక్ మెయిల్ చేయించి మరిన్ని డబ్బులు డిమాండ్ చేయించింది. ఇలా దాదాపు రూ.40 లక్షల వరకు బాధితుడి నుంచి దోచేశారు. దీంతో అనుమానం వచ్చిన ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
junagadh honey trap case
జునాగఢ్‌కు చెందిన ఒక ఫారెస్ట్ అధికారి 2017లో తన ఉద్యోగం నుండి పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి చోబారి రోడ్డులో నివసిస్తున్నారు. ఇటీవల రాజ్‌కోట్‌కు చెందిన ఊర్మిళ అనే మహిళ అతడికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. ఆ రిక్వెస్ట్‌ను అతడు యాక్సప్ట్ చేశాడు. అక్కడ నుంచి ఆమె ఆ రిటైర్డ్ అధికారికి మెసేజ్‌లు చేయడం ప్రారంభించింది. ఇలా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత వీరు ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్‌లో చాట్ చేసుకున్నారు.
જૂનાગઢમાં નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત ત્રણની ધરપકડ, 40 લાખની માંગી હતી ખંડણી#Junagadh#JunagadhPolice#RetiredRFO#HoneyTrap#HoneyTrapCase#ViralVideo#VTVDigitalpic.twitter.com/Zv8fQGcwKA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 6, 2025
తరచూ మెసేజ్‌లు, ఫోన్లు చేసుకుని మాట్లాడుకునే వారు. అలా ఆ అధికారిని ఊర్మిళ ప్రేమలోకి దించింది. దీంతో మరింత దగ్గరయ్యారు. ఊర్మిళ తన జీవితం గురించి అతడికి తరచూ తప్పుడు కథలు చెప్పేది. తాను ఒంటరిగా ఉన్నానని చెప్పుకుంటూ అతనితో భావోద్వేగ బంధాన్ని పెంచుకుంది. ఈ క్రమంలో దాదాపు ఐదు నెలల క్రితం ఊర్మిళ అతన్ని రాజ్‌కోట్‌లోని ఒక హోటల్‌కు రమ్మని చెప్పింది. అక్కడ హోటల్‌లో వారు శారీరక సంబంధం పెట్టుకున్నారు. అప్పుడే ఊర్మిళ అతడికి తెలియకుండా తన ఫోన్‌లో ప్రైవేట్‌గా కలిసిన దృశ్యాన్ని చిత్రీకరించింది.
అయితే ఇది అక్కడితో ఆగలేదు. జూన్ 2025లో ఊర్మిళ అతడికి ఫోన్ చేసి తాను గర్భవతినని, అబార్షన్ కోసం డబ్బు అవసరమని చెప్పి పదే పదే డబ్బు డిమాండ్ చేసింది. ఆమె మాటలు నమ్మిన రిటైర్డ్ అధికారి గూగుల్ పే ద్వారా చాలాసార్లు డబ్బు పంపాడు. కానీ ఇదంతా ఊర్మిళ ప్లాన్‌లో భాగమని అతడు నమ్మలేకపోయాడు. ఇక సెప్టెంబర్ 19, 2025న ఊర్మిళ మళ్ళీ అతడికి ఫోన్ చేసి చోటిలాలోని ఒక హోటల్‌లో కలుద్దామని పిలిచింది. అక్కడ వీరు మరోసారి శృంగారంలో పాల్గొన్నారు. ఈసారి కూడా ఊర్మిళ సీక్రెట్‌గా ఆ ప్రైవేట్ దృశ్యాలను చిత్రీకరించింది.
ఇలా కొన్ని రోజుల తర్వాత.. రిటైర్డ్ అధికారికి తెలియని నంబర్ నుండి వాట్సాప్ కాల్ అండ్ మెసేజ్ వచ్చింది. ఊర్మిళతో ప్రైవేట్‌గా హోటల్‌లో కలిసిన వీడియో తన వద్ద ఉందని, అది బయటకు రాకుండా ఉండాలంటే తనకు రూ. 40 లక్షలు ఇవ్వాలని అవతల వ్యక్తి డిమాండ్ చేశాడు. ఆ వీడియో కుటుంబంలోని అందరికీ పంపిస్తానని బెదిరించాడు. వెంటనే ఆ బాధితుడు ఊర్మిళకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె కూడా.. తనకూ ఫోన్ చేసి బెదిరించారని అతడికి తెలిపింది. దీంతో రిటైర్డ్ అధికారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. అసలు విషయం బయటపడింది. ఊర్మిళ స్వయంగా హోటల్ వీడియోను రికార్డు చేసి తన పార్ట్‌నర్ జీషన్‌కు ఇచ్చిందని, ఆ తర్వాత అతను వాట్సాప్ కాల్ ద్వారా రిటైర్డ్ అధికారికి బ్లాక్‌మెయిల్ చేశాడని తేలింది. ఈ కేసుకు సంబంధించి ఊర్మిళ, షగుఫ్తా, జీషన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.